గత కొన్నేళ్లలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ సర్ప్రైజింగ్, సెలబ్రేటెడ్ వెడ్డింగ్స్‌లో కీర్తి సురేష్‌ది ఒకటని చెప్పాలి. కెరీర్ మంచి ఊపు మీద ఉండగానే ఆమె ఆంటోనీ తట్టిల్ అనే తన లాంగ్ టైం బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుంది. ఐతే ఆంటోనీతో ఆమె 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తను చెబితే కానీ.. మీడియాకు తెలియలేదు. ఫిలిం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల గురించి శోధించి తెలుసుకునే మీడియా.. కీర్తి విషయంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది.
కీర్తి ఫలానా నటుడిని పెళ్లాడబోతోంది.. ఆ సంగీత దర్శకుడితో ప్రేమలో ఉంది.. అంటూ రకరకాల ఊహాగానాలు షికారు చేశాయి కానీ.. తన ఒరిజినల్ లవ్ గురించి వార్తలే రాలేదు. అందరికీ పెద్ద షాకిస్తూ తన ప్రేమ గురించి వెల్లడించి.. ఎక్కువ టైం తీసుకోకుండా ఆంటోనీని పెళ్లాడేసింది కీర్తి. పెళ్లి తర్వాతే తమ ప్రేమ కథ గురించి ఆసక్తికర విశేషాలను బయటపెడుతోంది కీర్తి.
తాజాగా తాను, ఆంటోనీ కలిసి లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్న విషయాన్ని ఆమె వెల్లడించింది. తాను, ఆంటోనీ 15 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్నామని.. తమ పెళ్లి అంత వైభవంగా జరుగుతుందని ఊహించలేదని కీర్తి చెప్పింది. తాము కచ్చితంగా లేచిపోయే పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని అనుకున్నామని.. కానీ ఇంట్లో వాళ్లు అంగీకరించడంతో పెళ్లి తమ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వైభవంగా జరిగిందని ఆమె తెలిపింది.
ఎప్పుడూ చాలా దృఢంగా ఉండే ఆంటోనీ తాళి కట్టే సమయంలో ఎమోషనల్ అయ్యాడని.. తొలిసారి తన కళ్లలో నీళ్లు చూశానని.. అందుకే తాను కూడా కన్నీళ్లు పెట్టుకున్నానని.. కల నిజమైనట్లు అనిపించడంతో తామిద్దరం అంత భావోద్వేగానికి గురయ్యామని చెప్పింది కీర్తి. 15 ఏళ్ల ప్రేమకు సాక్ష్యంగా 30 సెకన్లలో అంతా అయిపోయిందని.. దీంతో ఆనంద భాష్పాలు ఆగలేదని.. ఇదొక అందమైన ప్రయాణం అని కీర్తి వ్యాఖ్యానించింది. 2024 డిసెంబరు 12న కీర్తి, ఆంటోనీ పెళ్లితో ఒక్కటైన సంగతి తెలిసిందే.
This post was last modified on January 29, 2026 1:54 pm
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…