Movie News

నిజమైతే మాత్రం సాయిపల్లవికి ఛాలెంజే

అందరూ మర్చిపోయి ఎప్పుడో ఆలస్యంగా వస్తుందిలే అని భావిస్తున్న కల్కి 2 పేరు హఠాత్తుగా తెరమీదకు రావడంతో ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ యాక్టివ్ అయిపోయారు. రాజా సాబ్ డిజాస్టర్ గాయం బాధలో ఉంటూ దర్శకుడు మారుతీని అదే పనిగా టార్గెట్ చేస్తున్న అభిమానులు ఇప్పుడు డైవర్ట్ అవుతున్నారు.

వచ్చే నెల నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని, డార్లింగ్ ఒక వారానికి పైగానే వర్కింగ్ డేట్స్ ఇచ్చాడనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. అయితే అసలైన టాస్క్ హీరోయిన్ ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. పార్ట్ 1లో చాలా కీలకంగా వ్యవహరించిన దీపికా పదుకునే గత ఏడాదే తప్పుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు తన స్థానంలో సాయిపల్లవిని సంప్రదిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. అయితే ఆమె అంగీకారం తెలిపిందో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే కల్కిలో సుమతి పాత్ర చాలా కీలకం. సీక్వెల్ లో తనతో పాటు కమల్ హాసన్ క్యారెక్టర్ కు ఎక్కువ స్పేస్ దక్కనుంది. వీటిని బ్యాలన్స్ చేయడం దర్శకుడు నాగ్ అశ్విన్ కు పెద్ద టాస్క్.

అన్ని కోణాల్లో దీపికా కంటే సాయిపల్లవి బెటర్ పెర్ఫార్మరే కానీ మొదటి భాగం చూసిన కళ్ళతో ఇంత పెద్ద మార్పును అంగీకరించడం ఆడియన్స్ కి అంత సులభం కాకపోవచ్చు. ప్యాన్ ఇండియా మూవీ కావడం వల్ల అన్ని భాషల్లో యునానిమస్ యాక్సెప్టెన్స్ జరగాలి. ఇది అసలైన చిక్కు.

ఇంకోవైపు సాయిపల్లవికి కూడా ఇది ఛాలెంజే. ఎందుకంటే దీపికా స్థానంలో వచ్చింది కాబట్టి ముంబై మీడియా ప్రత్యేకంగా టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు. ఆల్రెడీ ఏక్ దిన్, రామాయణతో హిందీలో అడుగు పెట్టిన సాయిపల్లవి ఇప్పుడు కల్కి 2 కనక ఓకే చేస్తే మరిన్ని బలమైన అడుగులు బాలీవుడ్ వైపు వేసినట్టు అవుతుంది.

ఇప్పటికే స్క్రిప్ట్ స్టేజిలో రెండేళ్లు గడిపేసిన కల్కి 2  మీద వైజయంతి సంస్థ మరింత భారీ బడ్జెట్ పెట్టనుంది. హైప్ ని మ్యాచ్ చేసేలా ఎంత ఖర్చు పెట్టేందుకైనా అశ్వినిదత్ ఫ్యామిలీ సిద్ధంగా ఉంది. మరి సాయిపల్లవి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఈ ప్రాజెక్టుకు మరో ప్రధాన ఆకర్షణ తోడవుతుంది. 

This post was last modified on January 29, 2026 11:13 am

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

5 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

7 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

9 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

10 hours ago