టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ పరస్పరం బాక్సాఫీస్ వద్ద తలపడిన సందర్భాలు బోలెడున్నాయి కానీ ఒకే బ్యాక్ డ్రాప్ తో ఒకే టైంలో నటించిన సినిమాలు తక్కువే. కానీ ఈసారి ఇది బ్రేకయ్యే అవకాశాలు ఉన్నాయి.
ముందుగా మెగాస్టార్ దర్శకుడు బాబీ కలయికలో రూపొందుతున్న మూవీకి గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. కోల్కతా నగరంలో జరిగే యాక్షన్ డ్రామాని చాలా కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారని సమాచారం. అనస్వర రాజన్ కూతురుగా, మోహన్ లాల్ స్పెషల్ క్యామియోలో మెరవనున్న ఈ సినిమాకు కాక, కాకాజీ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట కానీ ఇంకా ఫైనల్ చేయలేదు.
బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందబోయే మూవీ కూడా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలోనే సాగుతుందని అంతర్గత సమాచారం. ముందు అనుకున్న పీరియాడిక్ సెటప్ కాకుండా పూర్తిగా వేరే సబ్జెక్టుని తీసుకున్న విషయం వెల్లడైంది. ఇది ముంబైలో జరుగుతుందని, బాలయ్య గెటప్ సోషల్ మీడియాలో రచ్చ చేయడం ఖాయమని యూనిట్ నమ్మకంగా చెబుతోంది.
అయితే వీటిలో ఏది ముందు వస్తుందనేది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ ఏదైనా ఆలస్యమైతే 2027 సంక్రాంతికి చిరు వర్సెస్ బాలయ్య క్లాష్ మరోసారి చూడొచ్చు. అయితే ఇప్పటికిప్పుడు ఏదీ నిర్ధారణగా చెప్పలేం కానీ వెయిట్ చేయాలి.
గతంలో ఈ ఇద్దరూ గ్యాంగ్ స్టర్స్ గా నటించిన సినిమాలు ఉన్నాయి. చిరంజీవి ఖాతాలో లంకేశ్వరుడు, గాడ్ ఫాదర్, బిగ్ బాస్ ఉండగా బాలయ్య అశోక చక్రవర్తి, యువరత్న రాణా, పైసా వసూల్ లో డాన్ గా కనిపించారు. అయితే ఇవేవీ ఆశించిన విజయాలు సాధించకపోవడం గమనార్హం.
మరి ఇంత సీనియారిటీ వచ్చాక ట్రై చేయడం ఆసక్తి రేపే విషయం. మరో ట్విస్టు ఏంటంటే బాబీ, గోపీచంద్ ఇద్దరూ మంచి స్నేహితులు. గోపీచంద్ దగ్గర బాబీ డాన్ శీను, బలుపు లాంటి వాటికి పని చేశారు. బాస్, బాలయ్య ఇద్దరూ ఒకే జానర్ చేసే మాట నిజమైతే మాత్రం అభిమానులకు మంచి విందు. ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates