ఒక పెద్ద సీజన్ అయిపోతే దాని ప్రభావం బాక్సాఫీస్ మీద కొన్ని రోజులు లేదా ఒక్కోసారి కొన్ని వారాల పాటు ఉంటుంది. సంక్రాంతి కన్నా మంచి ఉదాహరణ అక్కర్లేదు. పండక్కు ఒకేసారి అయిదు సినిమాలు రావడంతో ఇతర నిర్మాతలు టూ వీక్స్ స్పేస్ వదిలేశారు. ఇప్పుడు అన్నీ సర్దుకున్నట్టే.
మన శంకరవరప్రసాద్ గారు ఒకటే ఇంకా అవర్లీ ట్రెండింగ్ కొనసాగిస్తుండగా, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి బాగా నెమ్మదించేశాయి. రాజా సాబ్ సెలవు తీసుకోవడానికి ఆల్రెడీ సిద్ధమైపోగా భర్త మహాశయులకు విజ్ఞప్తిని జనాలు సైడ్ చేశారు. ఇక జనవరి 30 వచ్చే కొత్త మూవీస్ కోసం ఎగ్జిబిటర్లు ఎదురు చూస్తున్నారు.
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ఓం శాంతి శాంతి శాంతి ఒకటే ప్రమోషన్ల పరంగా కొంచెం సౌండ్ చేస్తోంది కానీ దీంతో పాటు మరో అరడజను కొత్త రిలీజులు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. త్రిముఖ, దేవగుడి, జగన్నాథ్, వన్ బై ఫోర్, జమానా అంటూ బడ్జెట్ ఫ్రెండ్లీ సినిమాలు ఒకేసారి గంపగుత్తగా వస్తున్నాయి.
వీటికి ఓపెనింగ్స్ రావడం ఏమో కానీ కనీసం రిలీజ్ ఉందని ఆడియన్స్ కి రిజిస్టరయితే చాలనేలా ఉంది పరిస్థితి. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామిల సైలెంట్ మూవీ గాంధీ టాక్స్ మీద నిన్నటిదాకా బజ్ లేదు కానీ ట్రైలర్ వచ్చాక కాసింత అంచనాలు ఏర్పడ్డాయి. మంచి టాక్ తెచ్చుకుంటే నిలబడొచ్చు.
ఏతావాతా చెప్పేదేమంటే ఓం శాంతి శాంతిశాంతి కనక డీసెంట్ టాక్ తెచ్చుకుంటే ఈజీగా గట్టెక్కుతుంది. మిగిలినవి మాత్రం ఎక్స్ట్రాడినరి అనిపించుకుంటేనే కనీసం పోటీ ఇవ్వగలవు. ఇవి కాకుండా అజిత్ గ్యాంబ్లర్ రీ రిలీజ్ ప్రకటించారు కానీ కొన్ని సెంటర్స్ బుకింగ్స్ తీసేయడం చూస్తుంటే వాయిదా పడిందేమోననే అనుమానం కలుగుతోంది.
తమిళంలో రికార్డులు సృష్టించిన మంకత డబ్బింగ్ వెర్షన్ కు ఇక్కడ ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. పండక్కు కళకళలాడిన థియేటర్లు మెల్లగా ఆక్యుపెన్సీలు తగ్గిపోతున్న ప్రమాద ఘంటికలు వింటున్నాయి. మళ్ళీ ఊపు ఎవరైనా తెస్తారేమో ఇంకో నాలుగు రోజుల్లో తేలనుంది.
This post was last modified on January 27, 2026 10:17 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…