Movie News

స్పిరిట్ మీద ఇన్ని పుకార్లు ఎందుకు

టాలీవుడ్ లోనే కాదు అటు బాలీవుడ్ లోనూ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న స్పిరిట్ మీద పుకార్ల ప్రహసనం మాములుగా లేదు. ఒకరేమో చిరంజీవి తండ్రి పాత్ర చేస్తున్నారు, కనిపించే పదిహేను నిమిషాలు స్క్రీన్ దద్దరిల్లి పోతుందని అంటారు. ఇంకొకరేమో వర్షం తర్వాత గోపీచంద్ ఇందులో విలన్ గా చేయబోతున్నాడు, ఇద్దరు ఫ్రెండ్స్ ఫేస్ ఆఫ్ చూసేందుకు రెండు కళ్ళు చాలవని చెబుతారు. మరొకరు ఇంకో అడుగు ముందుకేసి ప్రభాస్ ని రెండు గంటలు ఎండలో నిలబెట్టి మరీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా షాట్ ఓకే చేశాడని టంకు కొడతారు. ట్విస్టు ఏంటంటే ఇవేవి నిజాలు కాదు. అన్నీ గాసిప్సే.

సోషల్ మీడియాలో రీచ్ కోసం కొన్ని హ్యాండిల్స్ పడుతున్న తంటాలకు ఇది నిదర్శనం. స్పిరిట్ గురించి ఏ వార్త అయినా సరే క్షణాల్లో వైరల్ అవుతోంది. అందులోనూ రాజా సాబ్ వల్ల తీవ్ర నిరాశలో ఉన్న అభిమానులకు వంగా మీద మాములు ఆశలు లేవు. ఓ రేంజ్ లో నమ్మకం పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే అతను కష్టపడతాడని వేరే చెప్పనక్కర్లేదు. అందుకే ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి ఏ అప్డేట్ అయినా నిజమా కాదా అని తెలుసుకునే లోపు ఊరంతా చక్కర్లు కొట్టేస్తోంది. కొంత కీలక భాగం పూర్తి చేసిన ప్రభాస్ వచ్చే నెల మొదటి వారంలో ఫౌజీకి కొన్ని డేట్లు ఇవ్వబోతున్నాడని సమాచారం. ఇందులో కీలక షెడ్యూల్ ఉంటుందట.

వీటి సంగతి ఎలా ఉన్నా వచ్చే ఏడాది మార్చి 5 విడుదల తేదీ లాక్ చేసుకోవడంతో స్పిరిట్ ని ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన డేట్ కి రిలీజ్ చేసేందుకు సందీప్ రెడ్డి వంగా పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. తన సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ తో పెద్దగా పనుండదు. సన్నివేశాల్లోని డెప్త్ తోనే ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తారు. యానిమల్ లో జరిగింది అదే. ఇప్పుడీ స్పిరిట్ లో కూడా అంతకు మించే ఉంటాయట. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ తో ప్రభాస్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో వస్తున్నాయని అంటున్నారు. అయినా ఇంకా పద్నాలుగు నెలల టైం ఉంది కాబట్టి ఇంకా బోలెడు ఇన్ఫో రావాల్సి ఉంటుంది కనక ఫ్యాన్స్ ప్రశాంతంగా ఉండొచ్చు.

This post was last modified on January 27, 2026 9:20 pm

Share

Recent Posts

హిట్టు కొట్టాడు… మాయమైపోయాడు

టాలీవుడ్లో వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరోలు కూడా చాలామంది గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. హిట్టు కోసం ప్రయత్నం ఆపట్లేదు.…

36 minutes ago

యాక్షన్ కు రియాక్షన్ – తాట తీసిన పోలీసులు

రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది. కన్నూ మిన్నూ కానకుండా విచ్చలవిడిగా దారుణాలకు పాల్పడుతుంది. గంజాయి మత్తులో జరుగుతున్న నేరాలు, ఘోరాలు…

3 hours ago

భీమవరం బ్యాగ్రౌండ్ ఉన్నా వాడుకోలేదా రవితేజ…

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…

10 hours ago

అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు.…

11 hours ago

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ…

11 hours ago

జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?

ఇదేమీ ఊహాజ‌నిత వార్త‌కాదు. కొంద‌రు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో గ‌త…

12 hours ago