Movie News

ఈ నగరానికి ఏమైంది-2… అతను లేనిది అందుకా?

థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ‘ఈ నగరానికి ఏమైంది’ ఆ కోవకు చెందిన సినిమానే. ‘పెళ్ళిచూపులు’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన తరుణ్ భాస్కర్.. ఆ తర్వాత రూపొందించిన చిత్రమిది. ఐతే పాజిటివ్ టాకే వచ్చినప్పటికీ.. సినిమా పెద్దగా ఆడలేదు. కానీ తర్వాత టీవీల్లో, ఓటీటీలో ఈ సినిమాను విరగబడి చూశారు. 

రెండేళ్ల ముందు రీ రిలీజ్ చేస్తే.. ఫస్ట్ రిలీజ్ కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఈ కల్ట్ మూవీకి తరుణ్ భాస్కర్ ఇప్పుడు సీక్వెల్ తీస్తున్నాడు. షూటింగ్ కూడా పూర్తి కావచ్చింది. ఐతే ఫస్ట్ పార్ట్‌లో కీలక పాత్ర పోషించిన సుశాంత్ రెడ్డి ఇందులో లేకపోవడం ‘ఈఎన్ఈ’ ప్రేమికులకు నిరాశ కలిగించే విషయమే. ముందు సినిమా అనౌన్స్ చేసినపుడు సుశాంత్ కూడా ఇందులో భాగమే. కానీ తర్వాత అతను తప్పుకుంటే ‘హిట్’ ఫేమ్ కార్తీక్ తన స్థానంలోకి వచ్చాడు.

ఇటీవలే సుశాంత్ ఈ చిత్రంలో లేని విషయాన్ని దర్శకుడు తరుణ్ భాస్కర్ ఒక పోస్టు ద్వారా వెల్లడించి, ఆ విషయంలో ఒకింత నిరాశను వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఈ చిత్ర నిర్మాత సృజన్ యరబోలు.. సుశాంత్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడానికి అసలు కారణమేంటో వెల్లడించాడు. సినిమా అనౌన్స్ చేసినపుడు సుశాంత్ ఇందులో నటించడానికి సుముఖంగానే ఉన్నాడని.. కానీ తన కుటుంబానికి ఉన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ వల్ల అతను ఈ చిత్రం నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు సృజన్. 

ఈ సిదనిమా మొదలయ్యాక ఒక పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు సుశాంత్ సంస్థ చేతికి వచ్చిందని.. వైజాగ్ కేంద్రంగా చేయాల్సిన భారీ ప్రాజెక్టు అదని.. దాని కోసం సుశాంత్ పూర్తి స్థాయిలో పని చేయాల్సి ఉందని.. ఒకవైపు సినిమా చేస్తూ దానికి న్యాయం చేయడం సాధ్యం కాదని.. సుశాంత్ అందుబాటులో లేకుంటే ఆ ప్రాజెక్టు తన సంస్థ చేజారుతుందని.. ఆ కమిట్మెంట్ కోసమే అతను ‘ఈఎన్ఈ-2’ నుంచి అయిష్టంగానే తప్పుకున్నాడని సృజన్ చకెప్పాడు.

This post was last modified on January 27, 2026 1:07 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

50 కోట్ల నష్టం నుండి 50 కోట్ల లాభం వరకు!

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్కోసారి ఫలితం అటు ఇటు అయినా, కమ్ బ్యాక్ ఇస్తే…

2 minutes ago

‘కూటమిలో ఇబ్బందులు సరే.. అయినా కలిసి ఉండాల్సిందే’

పార్టీ అధినేత ఒక లక్ష్యం నిర్దేశించుకున్నారు. దానిని ముందుకు తీసుకువెళ్లడం మనందరి బాధ్యత. ఈ క్రమంలో అనేక ఇబ్బందులు వస్తాయి.…

9 minutes ago

ఉస్తాద్ వచ్చేదాకా ఊపు రాదా

సంక్రాంతి సినిమాల సందడి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మహా అయితే ఇంకో వారం బండి లాగొచ్చు కానీ ఆ తర్వాత…

37 minutes ago

ఒక్కడు దర్శకుడి ఒంటరి పోరాటం

దర్శకుడు గుణశేఖర్ అంటే మూవీ లవర్స్ కు వెంటనే గుర్తొచ్చే పేర్లు ఒక్కడు, చూడాలని ఉంది. భారీతనానికి కేరాఫ్ అడ్రెస్…

2 hours ago

బన్నీ సినిమా గ్లింప్స్‌ పై ఊరిస్తున్న దర్శకుడు

‘పుష్ప-2’ తర్వాత బన్నీ నుంచి వస్తుందనుకున్న సినిమా వేరు. అతను ఎంచుకున్న సినిమా వేరు. త్రివిక్రమ్‌తో కొన్నేళ్ల నుంచి ప్లానింగ్‌లో…

2 hours ago

లైంగిక ఆరోపణలపై స్పందించిన జనసేన ఎమ్మెల్యే

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ వివాహిత సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను…

2 hours ago