గత ఏడాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు కూలీ రూపంలో ఊహించని ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆ టైంలో చాలా విమర్శలు చవి చూడాల్సి వచ్చింది. వసూళ్లు అయిదు వందల కోట్ల దాకా వచ్చాయని ప్రచారం జరిగింది కానీ ఆడియన్స్ రెస్పాన్స్ మాత్రం నెగటివ్ గా రావడంతో ఫైనల్ గా హిట్టు లిస్టులోకి చేరలేదు.
ఇటీవలే అల్లు అర్జున్ తో ప్యాన్ ఇండియా మూవీని అఫీషియల్ గా లాక్ చేసుకున్న లోకేష్ కనగరాజ్ మీద తమిళ ఫ్యాన్స్ కాసింత గుర్రుగా ఉన్నారు. ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ తో పాటు రజని – కమల్ మల్టీస్టారర్ మూవీని వదులుకోవడం పట్ల కోపం ప్రదర్శించారు. వాటికి క్లారిటీ వచ్చేసింది.
రజని-కమల్ కలిసి నటించే కాంబో మూవీ మొదట లోకేష్ చేతికే వచ్చింది. కానీ వాళ్ళు యాక్షన్ ఎంటర్ టైనర్ కాకుండా ఏదైనా లైట్ ఎమోషన్స్ ఉన్న ఎంటర్ టైనర్ కోరుకున్నారు. దాంతో అది హ్యాండిల్ చేయలేననే అనుమానంతో లోకేష్ వద్దనుకున్నారు. ఈలోగా ఖైదీ 2 కోసం అట్టుపెట్టుకున్న డేట్లను కార్తీ వేరొకరికి ఇవ్వాల్సి రావడంతో లోకేష్ ఇటు హైదరాబాద్ వచ్చి మైత్రితో ప్లాన్ చేసుకున్న ప్రాజెక్టుని ఫిక్స్ చేసుకున్నాడు. దానికి హీరోనే అల్లు అర్జున్. కూలి విమర్శలు లోకేష్ కు ఎన్నో పాఠాలు నేర్పించాయి. ట్విట్టర్, ఇన్స్ టా తెలియని అతని తల్లి ఆన్ లైన్ వార్తలు, హడావిడి చూసి ఏమిటి ఇదంతాని అడిగేవారు.
బన్నీతో సినిమా అయ్యాక లోకేష్ కనగరాజ్ చేయబోయే సినిమాలు ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్. ఇవి చేయకుండా ఇండస్ట్రీ వదిలి వెళ్లడు. లారెన్స్ హీరోగా తన పర్యవేక్షణలో రూపొందుతున్న బెంజ్ కూడా సినిమాటిక్ యునివర్స్ లో భాగమే. ఇక్కడ విషయాలన్నీ ఇటీవలే జరిగిన ఒక కార్యక్రమంలో స్వయంగా లోకేష్ చెప్పినవే.
35 కట్స్ ఇవ్వడం వల్లే కూలికి ఏ సర్టిఫికెట్ తీసుకున్నామని చెప్పిన ఈ క్రియేటివ్ దర్శకుడు శవాల దహనం కాన్సెప్ట్ వల్ల అధికారులు అలా ఫీలయ్యారని క్లారిటీ ఇచ్చారు. ఏదైతేనేం మూవీ లవర్స్ ని వెంటాడుతున్న ఎన్నో అనుమానాలకు లోకేష్ కనగరాజ్ స్వయంగా చెక్ పెట్టేశారు.
This post was last modified on January 26, 2026 3:52 pm
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…