లక్ష టికెట్లకు తగ్గడం లేదు నారాయణా

తొలి వారంలోనే మూడు వందల కోట్ల గ్రాస్ చకచకా అందుకున్న మన శంకరవరప్రసాద్ గారు తర్వాత వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ రిపబ్లిక్ డే లాంగ్ వీకెండ్ వాడుకుంటూ మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. రెండో శనివారం బుక్ మై షోలో లక్షకు పైగా టికెట్లు అమ్ముడుపోగా ఆదివారం ఆ సంఖ్య లక్ష ఇరవై వేలను దాటేసింది.

ఇవాళ గణతంత్ర దినోత్సవం నేషనల్ హాలిడే కాబట్టి బుకింగ్స్ మళ్ళీ గణనీయంగా పెరుగుతున్నాయి. వరల్డ్ వైడ్ 350 కోట్లని టచ్ చేసిన మెగా మూవీకి నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్ చేశారు. నయనతార తప్ప టీమ్ మొత్తం హాజరై సందడి సందడిగా జరుపుకుంది.

రెండు వారాలు పూర్తవుతున్నాయి కాబట్టి మన శంకరవరప్రసాద్ గారికి ఈ రోజు చాలా కీలకం. అభిమానులు ఆశిస్తున్న నాలుగు వందల కోట్ల మార్కుని అందుకోవడం అసాధ్యం కాదనిపించడం లేదు కానీ వేగంగా అయితే కాదు. ఫ్రైడే తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి తప్ప చెప్పుకోదగ్గ రిలీజ్ ఏమీ లేవు.

సో ఇంకో వీకెండ్ మెగాస్టార్ కోసం ఎదురు చూస్తోందని చెప్పొచ్చు. అది కూడా వాడుకుంటే నాలుగు సెంచరీలు అందుకోవచ్చు. ఫ్యాన్స్ దాని కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రమోషన్ల పరంగా టీమ్ చేయాల్సింది ఇక అయిపోయినట్టే. చిరంజీవి, వెంకటేష్ తమ కొత్త సినిమాల్లో బిజీ అయిపోతారు.

రీజనల్ మూవీస్ లో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు సాధించిన మన శంకరవరప్రసాద్ గారు నెక్స్ట్ రాబోయే సినిమాలకు కొత్త టార్గెట్ నిర్దేశించింది. ప్యాన్ ఇండియా లెవెల్ కాకపోయినా కేవలం సింగల్ లాంగ్వేజ్ తో ఎలాంటి అద్భుతాలు చేయొచ్చో నిరూపించింది. ముఖ్యంగా అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ ని పట్టుకున్న విధానం ఒక గ్రామర్ బుక్కుగా మారిపోయింది.

ఇది చూసేందుకు సులభంగా కనిపించినా పాటించడం మాత్రం అంత సులభం కాదు. 2027 సంక్రాంతికి అప్పుడే ఒక కర్చీఫ్ సిద్ధం చేసుకున్న రావిపూడి దానికి సంబంధించిన ప్రకటన, వివరాలు త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు.