Movie News

అల్లు అర్జున్ తో కంటెంట్ ఉన్న నటుడు?

టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్ అయిన అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ AA22పై బజ్ మాములుగా లేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో స్పీడ్ పెంచుతున్నారు. ప్రస్తుతం ముంబై పరిసరాల్లో శరవేగంగా జరుగుతోంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా క్యాస్టింగ్ కూడా గట్టిగానే ఉండనుంది. ఇక సినిమాలో అల్లు అర్జున్ తో తలపడేందుకు ఒక పవర్‌ఫుల్ నటుడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 

కంటెంట్ ఉన్న నటుడిగా బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న జిమ్ సర్భ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్. దేశంలో లో ప్రస్తుతం హీరోల తరువాత ఆర్టిస్టులలో అత్యధిక పారితోషకం తీసుకునే వారిలో ఈయన ఒకరు. గతేడాది విడుదలైన ‘కుబేర’ సినిమాతో జిమ్ సర్భ్ తెలుగు ఆడియన్స్‌కు పరిచయం అయ్యారు.

అందులో తన అద్భుతమైన నటనకు మంచి మార్కులు పడ్డాయి. నీర్జా, పద్మావత్, సంజు వంటి చిత్రాల్లో జిమ్ సర్భ్ చేసిన రోల్స్ అతని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ లుగా నిలిచాయి. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో జిమ్ సర్భ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

ఈ సినిమాలో స్టార్ కాస్ట్ కూడా చాలా గ్రాండ్ గా ఉండబోతోంది. దీపికా పదుకొనే మెయిన్ ఫీమేల్ లీడ్‌గా నటిస్తున్నట్లు ఇప్పటికే అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. ఆమెతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపిస్తారని, విజయ్ సేతుపతి స్పెషల్ కామియో ఉండే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది.

అల్లు అర్జున్ తన మార్కెట్ రేంజ్ ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ సినిమాను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. అట్లీ మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్ కు జిమ్ సర్భ్ లాంటి పవర్‌ఫుల్ నటులు తోడవ్వడం సినిమాకు పెద్ద అసెట్. వరుస హిట్లతో ఉన్న అట్లీ.. బన్నీని ఒక సరికొత్త డైమెన్షన్‌లో చూపించడానికి రెడీ అయ్యారు. ఈ భారీ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

This post was last modified on January 25, 2026 3:18 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చిరును కదిలించిన మహిళా అభిమాని

మెగాస్టార్ చిరంజీవి ఏ వేదిక మీద మాట్లాడినా.. తన అభిమానుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. అభిమానులే తనకు ఇంధనం అని…

30 minutes ago

2026 టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ టీజర్

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 2026 మొదటి ఆరు నెలలు ఫుల్ ప్యాక్డ్ గా కనిపిస్తున్నాయి. జనవరిలో మన శంకరవరప్రసాద్ గారు…

5 hours ago

ఇలా ఐతే కష్టమే సంజూ!

టీమిండియా సెలక్షన్ లో పేరు లేకుంటే ‘జస్టిస్ ఫర్ సంజు శామ్సన్’ అనే ట్రెండ్ గత రెండేళ్లలో ఎక్కువగా కనిపించింది.…

8 hours ago

వివాహేతర సంబంధం.. చంపేస్తున్నారు

వివాహేతర సంబంధాలు దేశంలో పెరుగుతున్నాయంటూ ఇటీవలే ఓ సర్వే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే వివాహేతర సంబంధాలు ఎలా ఉన్నా,…

9 hours ago

పది ఓవర్లలోనే చిత్తు చేసిన భారత్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో మరోసారి టీమిండియా తన విశ్వరూపాన్ని చూపించింది. జనవరి 25న గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం…

10 hours ago

వైరల్ ఫోటో – సర్దార్ ‘పవన్’ సింగ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఆధ్మాత్మిక చింతన ఎక్కువన్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మ పరిరక్షణ కోసం…

11 hours ago