Movie News

బోయపాటే దొరికాడు… జాగ్రత్త పడాల్సిందే గోపి!

నందమూరి బాలకృష్ణతో సరైన మాస్ కంటెంట్ పడితే బాక్సాఫీస్ దగ్గర ఆ వైబ్ మామూలుగా ఉండదు. అయితే అదే బాలయ్యను పెర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తాడని పేరున్న బోయపాటి శ్రీను సైతం ఇటీవల ‘అఖండ 2’ తో బాక్సాఫీస్ దగ్గర తడబడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. హ్యాట్రిక్ హిట్ల కాంబినేషన్, భారీ హైప్ ఉన్నప్పటికీ కమర్షియల్ గా ఆ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలయ్యతో సినిమా చేయబోతున్న గోపీచంద్ మలినేని మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.

నిజానికి బాలయ్య కెరీర్‌లో బోయపాటి శ్రీను ఒక స్పెషల్ డైరెక్టర్. గోపీచంద్ మలినేని కంటే బోయపాటి-బాలయ్య కాంబోలోనే ఎక్కువ హిట్స్ వచ్చాయి. సింహా, లెజెండ్, అఖండ వంటి చిత్రాలతో ఈ కాంబో టాలీవుడ్‌లో ఒక రేంజ్ సెట్ చేసింది. గోపీచంద్ మలినేని కంటే బోయపాటి కాస్త ముందున్న మరో లెవెల్ దర్శకుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. అలాంటి సీనియర్ దర్శకుడే ఈసారి బాక్సాఫీస్ లెక్కల్లో దొరికిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి మలినేని చేయబోయే NBK111 పై పడింది.

గోపీచంద్ మలినేని గతంలో బాలయ్యతో ‘వీరసింహారెడ్డి’ తీసి హిట్ కొట్టారు. అందులో బాలయ్యను బ్లాక్ అండ్ బ్లాక్ గెటప్‌లో చూపించి మాస్ ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టారు. అయితే ఆ సినిమా కమర్షియల్‌గా జస్ట్ బ్రేక్ ఈవెన్ మార్కును మాత్రమే దాటగలిగింది. సంక్రాంతి సీజన్ ప్లస్ అవ్వడం వల్ల ఆ ప్రాజెక్ట్ గట్టెక్కిందనేది వాస్తవం. ఇప్పుడు బోయపాటి సినిమాకే వసూళ్లు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో, మలినేని తన పాత సక్సెస్ ఫార్ములాను నమ్ముకుంటే సరిపోదని ఓ వర్గం ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మార్చి నుండి ప్రారంభం కానున్న ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం మలినేని రియాలిటీలోకి వచ్చి ఆలోచించుకోవాలి. కేవలం ఎలివేషన్లు, స్లో మోషన్ షాట్లు ఉంటే నేటి జనరేషన్ ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదు. కథలో దమ్ము ఉంటేనే సినిమాలు ఆడుతున్నాయని లేటెస్ట్ రిజల్ట్స్ ప్రూవ్ చేస్తున్నాయి. గోపీచంద్ మలినేని కంటెంట్ విషయంలో వంద శాతం ఎఫర్ట్ పెట్టాల్సిందే. ఈసారి మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా నిర్మిస్తోంది. బాలయ్య మార్క్ పౌరుషానికి సరైన కథా బలం తోడైతేనే ఈ సినిమా నిలబడుతుంది.

‘వీరసింహారెడ్డి’లో ఉన్న కొన్ని ల్యాగ్స్ ఈసారి రిపీట్ కాకుండా మలినేని జాగ్రత్త పడాలి. ఏదేమైనా ఈసారి గోపీచంద్ మలినేని కెరీర్‌కు ఒక పెద్ద పరీక్ష లాంటిది. బోయపాటి కంటే తానేం తక్కువ కాదని నిరూపించుకోవడంతో పాటు, బాక్సాఫీస్ దగ్గర ఒక సాలిడ్ కమర్షియల్ సక్సెస్ అందుకోవాలి. మాస్ డైరెక్టర్లందరికీ ఒక హెచ్చరికలాంటి రిజల్ట్స్ వస్తున్న ఈ తరుణంలో మలినేని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.

This post was last modified on January 25, 2026 12:32 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Nbk 111

Recent Posts

శిష్యుడికి యువరాజ్ ఛాలెంజ్

భారత క్రికెట్‌లో సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ వారసుడు దొరికాడనే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో…

29 minutes ago

చిరును కదిలించిన మహిళా అభిమాని

మెగాస్టార్ చిరంజీవి ఏ వేదిక మీద మాట్లాడినా.. తన అభిమానుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. అభిమానులే తనకు ఇంధనం అని…

2 hours ago

2026 టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ టీజర్

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 2026 మొదటి ఆరు నెలలు ఫుల్ ప్యాక్డ్ గా కనిపిస్తున్నాయి. జనవరిలో మన శంకరవరప్రసాద్ గారు…

6 hours ago

ఇలా ఐతే కష్టమే సంజూ!

టీమిండియా సెలక్షన్ లో పేరు లేకుంటే ‘జస్టిస్ ఫర్ సంజు శామ్సన్’ అనే ట్రెండ్ గత రెండేళ్లలో ఎక్కువగా కనిపించింది.…

10 hours ago

వివాహేతర సంబంధం.. చంపేస్తున్నారు

వివాహేతర సంబంధాలు దేశంలో పెరుగుతున్నాయంటూ ఇటీవలే ఓ సర్వే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే వివాహేతర సంబంధాలు ఎలా ఉన్నా,…

11 hours ago

పది ఓవర్లలోనే చిత్తు చేసిన భారత్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో మరోసారి టీమిండియా తన విశ్వరూపాన్ని చూపించింది. జనవరి 25న గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం…

11 hours ago