Movie News

సమయం ఆసన్నమైంది విశ్వంభరా..

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత అత్యంత ఆసక్తి రేకెత్తించిన చిత్రాల్లో ‘విశ్వంభర’ ఒకటి. ‘బింబిసార’ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన వశిష్ఠ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండడం.. ఇది ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహా ఫాంటసీ విజువల్ వండర్ కథతో తెరకెక్కుతుండడంతో మెగా అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. కానీ సినిమా మొదలైనపుడు ఉన్న భారీ అంచనాలను తర్వాత టీజర్ వచ్చి తగ్గించేసింది.

అందులో విజువల్ ఎఫెక్ట్స్, విజువల్స్ తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఇంత పెద్ద ప్రాజెక్టులో ఈ సబ్ స్టాండర్డ్ ఎఫెక్ట్స్ ఏంటి అనే ప్రశ్నలు తలెత్తాయి. మొత్తంగా సినిమా క్వాలిటీ మీద సందేహాలు రేకెత్తించేలా సాగింది టీజర్. ఈ ఫీడ్ బ్యాక్ చూశాక టీం కంగారు పడింది. వీఎఫెక్స్ మీద మళ్లీ పని చేయడం మొదలుపెట్టింది. అందుకే గత ఏడాది సంక్రాంతికి అనుకున్న సినిమా కాస్తా.. ఈ పండక్కి కూడా రిలీజ్ కాలేదు. వేసవిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మధ్యలో చిరు చేసిన మరో సినిమా ‘మనశంకర వరప్రసాద్ గారు’ కోసం సైడ్ ఇచ్చేసిన ‘విశ్వంభర’ టీం.. చాలా కాలంగా అసలే అప్‌డేట్ ఇవ్వలేదు. అభిమానుల చర్చల్లో కూడా ఆ చిత్రం లేదు. ఐతే ఇటీవల సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ విజయం సాధించింది. రీజనల్ సినిమాల్లో ఇండస్ట్రీ హిట్ దిశగా అడుగులు వేస్తోంది. దీంతో చిరు, అభిమానులు సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఇక ‘విశ్వంభర’ మీదికి చిరు అండ్ కో ఫోకస్ మార్చాల్సిన సమయం ఆసన్నమైంది.

మెగా ఫ్యాన్స్ మాంచి ఊపుమీదున్న ఈ సమయంలోనే ‘విశ్వంభర’ నుంచి మంచి కంటెంట్‌తో మెప్పించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇంతకుముందు ఏ విజువల్స్ గురించి అందరూ కామెంట్ చేశారో.. ఇప్పుడు విజువల్స్‌తో మెప్పించడం మీదే సినిమాకు హైప్ వస్తుందా లేదా అన్నది ఆధారపడి ఉంది. చాలా టైం తీసుకుని మళ్లీ విజువల్స్, ఎఫెక్ట్స్ మీద పని చేసిన వశిష్ఠ టీం తాము ఏం మార్చామో, సినిమాను ఎంత అందంగా తీర్చిదిద్దుతున్నామో చూపించడానికి సరైన సమయం ఇదే. ఒక మంచి గ్లింప్స్ రిలీజ్ చేస్తే పోయిన హైప్ అంతా తిరిగొస్తుంది. వేసవి రిలీజ్‌కు గ్రౌండ్ ప్రిపేరవుతుంది.

This post was last modified on January 24, 2026 10:29 am

Share

Recent Posts

టాలీవుడ్ స్టార్లు ఆ మాయలో పడి నష్టపోతున్నారా

మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…

1 hour ago

అబ్బవరం ఈసారి బయటపడగలడా?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…

2 hours ago

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

7 hours ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

8 hours ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

12 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

12 hours ago