‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా మెగా అభిమానులకే కాదు.. మెగా ఫ్యామిలీకి చాలా చాలా ప్రత్యేకం. మెగాస్టార్ చిరంజీవి ఇందులో వింటేజ్ స్టైల్ కామెడీతో అలరించడం.. మళ్లీ తన బాక్సాఫీస్ స్టామినాను చూపించడం.. వసూళ్ల పరంగా రికార్డుల మోత మోగిస్తుండడం మెగా ఫ్యామిలీకి అమితానందాన్నిస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మాతల్లో చిరు తనయురాలు సుష్మిత కొణిదెల కూడా ఒకరు కావడంతో మెగా కుటుంబానికి ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది.
ఐతే ‘మన శంకర వరప్రసాద్ గారు’లో మరో ‘మెగా’ కనెక్షన్ కూడా ఉంది. ఈ చిత్రంలో డెహ్రాడూన్ ఎపిసోడ్ సందర్భంగా చిరు, ఆయన పిల్లల మీద ‘ఫ్లైయింగ్ హై’ అనే జాయ్‌ఫుల్ సాంగ్ వస్తుంది. ఆ పాట పాడింది చిరు మేనకోడలు కావడం విశేషం. తన పేరు.. నైరా. ఆమె చిరు సోదరి మాధవి తనయురాలు. ఈ అమ్మాయి సింగపూర్‌లో మ్యూజిక్ కోర్స్ చేస్తోంది.
ఆమె ప్రతిభ గురించి తెలుసుకుని ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో తనతో ఒక పాట పాడించారు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ పాటను సినిమా విడుదలకు ముందు లాంచ్ చేయలేదు. నేరుగా సినిమాలోనే ఈ పాటను చూసి ఆస్వాదించారు ప్రేక్షకులు. మంచి హుషారుగా సాగే ఈ పాటను చక్కగా ఆలపించింది నైరా.
ఈ అనుభవం గురించి ఆమె ఒక వీడియో కూడా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నైరా. తన ప్రతిభను కొనియాడుతూ అనిల్ రావిపూడి కూడా ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. మెగా ఫ్యామిలీలో ఇలాంటి ఒక టాలెంటెడ్ సింగర్ ఉందని ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. తన వాయిస్, ట్రెండీ సింగింగ్ స్టైల్ చూస్తే మున్ముందు ఆమె మరిన్ని సినిమా పాటలు పాడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on January 21, 2026 10:58 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…