2026 సంక్రాంతిని టాలీవుడ్ అంత సులభంగా మర్చిపోదు. ఎలివేషన్లు, విఎఫెక్స్ హడావిడిలు ఉన్న సినిమాలు ఆడలేదు. అవన్నీ కలగలసిన రాజా సాబ్ ప్రేక్షకుల తిరస్కారానికి గురయ్యింది. సోషల్ మీడియాలో తరచుగా క్రింజ్ కామెడీ పేరుతో కామెంట్స్ ఎదురుకునే అనిల్ రావిపూడి, ఏకంగా చిరంజీవి కెరీర్ హయ్యెస్ట్ ఇచ్చేలా మన శంకరవరప్రసాద్ గారుతో కళ్ళు చెదిరే మేజిక్ చేశాడు.
నార్త్ అమెరికా నుంచి నర్సీపట్నం దాకా ఎక్కడ చూసినా రికార్డుల మోతే. అనగనగా ఒక రాజు నిర్మాతలు ప్రకటించిన దాని ప్రకారం వంద కోట్ల గ్రాస్ దాటడమంటే మాటలు కాదు. కేవలం నాలుగు సినిమాల అనుభవమున్ననవీన్ పోలిశెట్టికి దక్కిన అతి పెద్ద ప్రమోషన్ ఇది.
నారి నారి నడుమ మురారి అంత థియేటర్ల కొరతలోనూ కేవలం మౌత్ టాక్, రివ్యూలతో సెలవు రోజుల్లో హౌస్ ఫుల్స్ నమోదు చేసింది. మెగాస్టార్ మేనియాలోనూ తన ఉనికిని చాటుకోవడంలో శర్వానంద్ సక్సెస్ అయ్యాడు. రవితేజకు ఊరట కలిగించేలా భర్త మహాశయులకు విజ్ఞప్తి సైతం డీసెంట్ సక్సెస్ అందుకుని రన్ కొనసాగిస్తోంది.
ఈ నాలుగు సినిమాలు వినోదమే ప్రధానంగా సాగాయి. దేంట్లోనూ కత్తులు పట్టుకుని నరుక్కోవడాలు, రక్తం చిందడాలు లేవు. వరప్రసాద్ గారులో మాత్రమే హీరో రెండుసార్లు తుపాకులు వాడతాడు, విలన్ కొంచెం వయొలెన్స్ చూపిస్తాడు. జనం వీటిని పట్టించుకోకుండా ఫన్ ఎంజాయ్ చేశారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పండగ సీజన్ లో ఆడియన్స్ సరదా కంటెంట్ డిమాండ్ చేస్తున్నారు. కుటుంబంతో కలిసి థియేటర్ కు వెళ్తే హాయిగా టైం పాస్ కావాలని కోరుకుంటున్నారు. నవ్వించాలని అడుగుతున్నారు. అప్పుడప్పుడు హనుమాన్ లాంటి డివోషనల్ మూవీస్ కీ పట్టం కడుతున్నారు.
సో వందల కోట్లు పెట్టకుండానే బాక్సాఫీస్ ని ఎలా కొల్లగొట్టాలో ఈ సీజన్ దర్శకులు నేర్పించారు. రెమ్యునరేషన్లు పక్కనపెట్టి కేవలం ప్రొడక్షన్ కాస్ట్ చూసుకుంటే అన్ని సినిమాలు ముప్పై నుంచి డెబ్భై కోట్ల లోపే పూర్తయ్యాయి. మరో ట్విస్ట్ ఏంటంటే ఏ మూవీ సంవత్సరాల తరబడి నిర్మాణంలో లేదు. అన్నీ ఏడాదిలోపే పూర్తయ్యాయి.
This post was last modified on January 20, 2026 10:49 am
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి హరీశ్ రావు ఈ రోజు సిట్ విచారణకు హాజరైన సంగతి…
సంక్రాంతి పండుగ తెలుగు వారికే కాదు.. తమిళులకూ చాలా స్పెషల్. అక్కడ కూడా పది రోజుల పాటు సెలవులుంటాయి. దీంతో…
నకిలీ మద్యం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్కు పరిమిత ఊరట లభించింది. ఇబ్రహీంపట్నం నకిలీ…
``ఆయనే నా బాస్. పార్టీలో నేను ఆయన కింద పనిచేస్తాను.`` అంటూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.…
ఒకప్పుడంటే మెగాస్టార్ చిరంజీవిని, ఆయన సినిమాలను అల్లు అర్జున్ కొనియాడడం పెద్ద విశేషంగా అనిపించేది కాదు. కానీ గత కొన్నేళ్లలో…
ఏపీ లిక్కర్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కోనున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తన ట్వీట్లతో రాజకీయ వర్గాల్లో…