ఆచార్య చిత్రంలో చరణ్ చేస్తోన్న పాత్రను అతిథి పాత్రలానే తీర్చిదిద్దాడు కొరటాల శివ. అయితే ఆ పాత్ర చరణ్‍తో చేయిద్దామని చిరంజీవి సలహా ఇచ్చిన పిమ్మట అందుకు అనుగుణంగా ఆ పాత్ర నిడివి పెంచారు. అయితే ‘ఆర్.ఆర్.ఆర్.’ షూటింగ్‍తో చరణ్ బిజీగా వుండడం, దాని కంటే ముందుగా చరణ్ మరో మల్టీస్టారర్ చేయడం తనకు ఇష్టం లేదని రాజమౌళి చెప్పడంతో మళ్లీ ఆ క్యారెక్టర్ లెంగ్త్ తగ్గించేసారు. అయితే లాక్‍డౌన్ కారణంగా ఆచార్య బాగా ఆలస్యం కావడం వల్ల ముందుగా అనుకున్న బడ్జెట్ ఇప్పుడు భారంగా మారింది. తన స్నేహితుడి నిర్మాణంలో ఈ చిత్రం చేస్తోన్న కొరటాల శివ పెరిగిన బడ్జెట్‍ను దృష్టిలో పెట్టుకుని చరణ్ క్యారెక్టర్ లెంగ్త్ పెంచితే తప్ప బడ్జెట్ వర్కవుట్ కాదంటూ చెప్పి మెగా హీరోలను లాక్ చేసాడట.
ఈ లాక్ డౌన్ అదీ లేనట్టయితే ఈ ప్రపోజల్‍కు రాజమౌళి అభ్యంతరం చెప్పి వుండేవాడేమో కానీ ఇప్పుడు తన సినిమా మరీ ఆలస్యం అవుతుండడం వల్ల అటు నుంచి కూడా పెద్దగా ఆక్షేపణలుండవు. అందుకే చరణ్ పాత్ర గురించి ఇంతకాలం మౌనంగా వున్న కొరటాల శివ ఇప్పుడా పాత్ర నిడివి గురించి ఓపెన్ అయిపోయాడు. అయితే ఆచార్య ముందు రిలీజ్ అయిన పక్షంలో ఈ తరంలోని అతి పెద్ద మల్టీస్టారర్‍గా ఆర్.ఆర్.ఆర్.కి వున్న క్రేజ్ ఏమైనా ఎఫెక్ట్ కావచ్చునేమో తెలీదు.
This post was last modified on December 14, 2020 9:16 pm
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన జానపద గాయకుడు మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…