Movie News

దండోరాకు మద్దతు… జీవిత కాలం లేటు

కొన్ని సినిమాలకు టైం కలిసి రాదు. కంటెంట్ అంతో ఇంతో బాగున్నా జనాలకు రీచ్ కాక కమర్షియల్ ఫెయిల్యూర్స్ గా నిలుస్తాయి. అవే ఓటిటిలో వచ్చినప్పుడు జనం ఆహా ఓహో అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తారు. దండోరా పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది.

గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో రిలీజైన ఈ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద కాసులు తేలేదు. రివ్యూలు, ప్రశంసలు చాలానే వచ్చాయి కానీ థియేటర్లలో రావాల్సిన డబ్బులు అరకొరనే. దీనికి ప్రధాన కారణం పెద్ద సంస్థ నిర్మించిన ఛాంపియన్, హారర్ ఎలిమెంట్స్ తో మెప్పించిన శంబాల లాంటి వాటికి పోటీగా నిలవడం. ఇవే దెబ్బ కొట్టాయి.

సరే జరిగిన దాన్ని మార్చలేం కానీ ఇప్పుడు దండోరాకు సోషల్ మీడియాలో సపోర్ట్ దక్కుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ట్వీట్ చేశాడంటే ఎంత బాగా కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా తారక్ ప్రతి సినిమాకు ఇలా రివ్యూ పెట్టడు. దండోరా విషయంలో మినహాయింపు ఇచ్చాడు.

అలాని దాంట్లో హీరో దర్శకుడితో తనకేం పరిచయం, స్నేహం లేదు. అయినా సరే ఒక మంచి మూవీ ఎక్కువ శాతం రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ట్వీట్ చేయడం మంచిదే. ఎందుకంటే డిజిటల్ లో వ్యూస్ ఎక్కువ రావడం వల్ల సదరు ప్రొడ్యూసర్ కు ఖచ్చితంగా ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది.

నిజానికి దండోరాకు ప్రధానంగా జరిగిన డ్యామేజ్ శివాజీ కామెంట్స్. ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మంచి ఉద్దేశంతో నాలుగు మాటలు చెప్పినా దానికి అభ్యంతర పదాలు వాడటంతో ఏకంగా మహిళా కమీషన్ కు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఇదేదో పబ్లిసిటీకి ఉపయోగపడుతుందేమోనని మూవీ లవర్స్ భావిస్తే అనవసరమైన డైవెర్షన్ వచ్చి లేనిపోని నెగటివిటీని మూటగట్టుకుంది. ఒకవేళ ఎప్పుడైనా సోలోగా సరైన సమయంలో వచ్చి ఉంటే బలగం అంత కాకపోయినా దండోరా సౌండ్ బాగానే వినిపించేదన్నది వాస్తవం. అందుకే పెద్దలు అంటారు రైలు రావడం జీవిత కాలం ఆలస్యం అని. దండోరాకు జరిగింది ఇదే.

This post was last modified on January 19, 2026 10:08 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Dhandoraa

Recent Posts

రజినీని వదిలేసి… విశాల్‌తో వెళ్తున్నాడు

సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌లలో ఒకడైన రజినీకాంత్‌తో సినిమా చేయాలని ప్రతి దర్శకుడూ ఆశిస్తాడు. ఒకసారి…

8 minutes ago

నాడు జగన్ నేడు కేటీఆర్… సేమ్ టు సేమ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి హరీశ్ రావు ఈ రోజు సిట్ విచారణకు హాజరైన సంగతి…

1 hour ago

ఇక్కడ 700 కోట్లు… అక్కడ 100 కోట్లే

సంక్రాంతి పండుగ తెలుగు వారికే కాదు.. తమిళులకూ చాలా స్పెషల్. అక్కడ కూడా పది రోజుల పాటు సెలవులుంటాయి. దీంతో…

2 hours ago

జోగి బ్రదర్స్ కు బెయిల్ వచ్చింది కానీ…

నకిలీ మద్యం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు పరిమిత ఊరట లభించింది. ఇబ్రహీంపట్నం నకిలీ…

2 hours ago

తన బాస్ ఎవరో చెప్పిన మోడీ

``ఆయ‌నే నా బాస్‌. పార్టీలో నేను ఆయ‌న కింద ప‌నిచేస్తాను.`` అంటూ.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆస‌క్తికర వ్యాఖ్యలు చేశారు.…

2 hours ago

చిరు సినిమాను ఆకాశానికెత్తేసిన బన్నీ

ఒకప్పుడంటే మెగాస్టార్ చిరంజీవిని, ఆయన సినిమాలను అల్లు అర్జున్ కొనియాడడం పెద్ద విశేషంగా అనిపించేది కాదు. కానీ గత కొన్నేళ్లలో…

3 hours ago