బిగ్‍బాస్ సీజన్ 4లో ఆది నుంచీ పీఆర్ సాయంతో అభిజీత్ లీడింగ్‍లో వుండేవాడు. మొదటి నాలుగైదు వారాలలో పదే పదే నామినేషన్లలోకి వెళ్లడానికి అత్యుత్సాహం చూపించేవాడు. మొదట్లో తనకు ఓట్లు వచ్చేలా పీఆర్ టీమ్ చూసుకున్నా కానీ తర్వాత అతడొక్కడే లాజికల్ పర్సన్‍లా, కాస్త పరిణతి వున్నవాడిలా కనిపించడంతో అభిజీత్‍కి ఓట్లు వేసేవాళ్లు పెరుగుతూ వచ్చారు. ఏ దశలోను అభిజీత్‍ని ఛాలెంజ్ చేసే కంటెస్టెంట్ వున్నాడనే అనిపించలేదు. మధ్యలో అరియానాకు ఓటింగ్ సడన్‍గా పెరిగింది. ఒక దశలో అభిజీత్‍కి ఈక్వల్ పర్సంటేజ్ ఓట్లు కూడా సాధించుకుంది. అయితే మొదట్నుంచీ అరియానాకు అతి తెలివి ఎక్కువ. ఏమి చేస్తే కెమెరాలు తనను క్యాప్చర్ చేస్తాయి, ఎలా మాట్లాడితే తన ఫుటేజ్ చూపిస్తారనే దానిపై ఆమె దృష్టి పెట్టేది.
ఈ అతి తెలివే ఆమెను వెనక్కు నెట్టింది. ఒక దశలో గేమ్ ఆడడానికే వచ్చానంటూ కౌశల్‍ని ఇమిటేట్ చేయాలని చూసి సాటి లేడీ కంటెస్టెంట్స్పై జాలి చూపించకుండా ప్రవర్తించి ఓట్లు కోల్పోయింది. ‘బిగ్‍బాస్ పువ్వు, కత్తి రెండూ ఇస్తాడు. ఏది వాడతారో అది మీ క్యారెక్టర్’ అని నాగార్జున అనడంతో ఆమె ఆత్మవిశ్వాసం దెబ్బతింది. మళ్లీ తన గ్రాఫ్ పుంజుకుంటోన్న దశలో గత వారం సోహెల్, మోనల్‍ని టార్గెట్ చేసి కెమెరాల ముందు విక్టిమ్‍గా స్వీయ చిత్రీకరణ చేసుకునే ప్లాన్‍లో పల్టీ కొట్టింది. నిన్నటికి నిన్న ఫైనలిస్ట్ గా తన పేరుని ప్రకటించగానే ధడేల్న కింద పడిపోయి ‘అతి’కి పరాకాష్ట అనిపించుకుంది. కాస్త ఈ అతి తగ్గించుకున్నట్టయితే బిగ్‍బాస్‍కి తొలి లేడీ విజేతగా నిలిచి వుండేది కానీ ఇప్పుడు అభిజీత్‍ని దాటి ముందుకెళ్లడం అసాధ్యం.
This post was last modified on December 14, 2020 9:11 pm
2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీలో కూటమి పార్టీలకు చెందిన శ్రేణుల నుంచి ఓ వినూత్న నినాదం వినిపించింది. సైకో…
బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ మీద జరిగిన రివ్యూలు, ఆన్ లైన్ విశ్లేషణలు, సోషల్…
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే ఎంటర్ టైనర్ కోసం హీరోయిన్ వేట కొనసాగుతోంది. ఏవేవో పేర్లు అనుకుని…
"తెలంగాణ పోలీసులు ట్రాఫిక్ విషయంలో కఠినంగా ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు."- ఇదీ.. కొన్నిరోజుల కిందట పోలీసు బాస్ చేసిన కామెంట్లు.…
ఎదురు చూసి చూసి అభిమానులే అంచనాలు తగ్గించేసుకున్న హరిహర వీరమల్లు గేరు మార్చబోతోందని తాజా సమాచారం. ఈ రోజు నుంచి…
నిన్న జరిగిన లార్వెన్ ఏఐ స్టూడియో ప్రారంభోత్సవంలో దర్శకులను ఉద్దేశించి నిర్మాత దిల్ రాజు అన్న మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.…