మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో గురించి వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగానే హడావుడి చేస్తున్నాయి. అయితే ఈ క్రేజీ కాంబో గురించి వినడానికి ఎంత బాగున్నా, ఇద్దరి లైనప్స్ గమనిస్తే మాత్రం అసలు స్పేస్ ఎక్కడుందనే సందేహం రాక మానదు.
చరణ్ ప్రస్తుతం తన కెరీర్ లోనే మోస్ట్ బిజీ ఫేజ్ లో ఉన్నారు, త్రివిక్రమ్ కూడా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ గ్యాప్ లో కొత్త ప్రాజెక్ట్ కోసం వీరు ఎలా స్పేస్ క్రియేట్ చేసుకుంటారనేదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్.
రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు, దాని తర్వాత సుకుమార్ తో ఒక భారీ ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే, ఇప్పటికే వెంకీతో ఆదర్శ కుటుంబం సెట్స్ పై ఉంది, ఆ తర్వాత ఎన్టీయార్ తో సినిమా చేయాల్సి ఉంది.
పాన్ ఇండియా లెవల్ లో అడుగులు వేస్తున్నప్పుడు ఒకేసారి మూడు నాలుగు సినిమాల లైనప్ మెయింటైన్ చేయడం ఎవరికీ అంత ఈజీ కాదు. కానీ ఇండస్ట్రీలో కమిట్మెంట్లు, ప్రాథమిక చర్చలు అనేవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఈ బజ్ కు ఆస్కారం ఏర్పడింది.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే, ఈ భారీ లైనప్ లో ఏ ఒక్క సినిమా రిజల్ట్ తేడా కొట్టినా ఆ తర్వాత ఉండే కమిట్మెంట్లు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే త్రివిక్రమ్ లాంటి సీనియర్ డైరెక్టర్లు అన్ని విషయాలను బేరీజు వేసుకోకుండా అంత తొందరగా ఒక నిర్ణయానికి రారు.
చరణ్ తో సినిమా చేయాలనే ఆలోచన ఉన్నా, అది ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే దానిపై క్లారిటీ రావడం ఇప్పుడప్పుడే సాధ్యం కాకపోవచ్చు. లైనప్ లో ఖాళీ లేనప్పుడు కొత్త కథను ఎగ్జిక్యూట్ చేయడం అంటే అది పెద్ద రిస్క్ తో కూడుకున్న పనే.
అయితే పవన్ కళ్యాణ్ నిర్మాణ భాగస్వామ్యంతో ఈ సినిమా ఉంటుందనే మరో టాక్ ఈ కాంబోపై హైప్ ను పెంచుతోంది. ఒకవేళ బాబాయ్ బ్యానర్ లో అబ్బాయి సినిమా అంటే డేట్లు అడ్జస్ట్ చేసి అయినా స్పేస్ క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉందనేది కొందరి అభిప్రాయం.
కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే మాత్రం ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్లు పూర్తి కావడానికే మరో రెండేళ్లు పట్టేలా ఉంది. బజ్ అయితే గట్టిగానే ఉంది కానీ అఫీషియల్ గా ఏదైనా ప్రకటన వచ్చే వరకు దీనిపై ఒక అంచనాకు రావడం కష్టమే.
This post was last modified on January 18, 2026 7:48 pm
మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు యూటర్న్ తీసుకున్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన…
మొదటి సినిమా సీతారామంతోనే.. సీత పాత్రలో కనిపించి.. తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత వచ్చిన…
స్టార్ హీరోలకు బయట కోట్ల మంది అభిమానులుంటారు. కానీ స్టార్ హీరోల్లో కూడా అభిమానులను సంపాదించుకునే వాళ్లు కొందరే ఉంటారు.…
థియేటర్ రిలీజ్ జరిగిన నెలలోపే జైలర్ 2 ఓటిటిలో వచ్చేస్తోంది. నవంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అమెజాన్ ప్రైమ్…
ఇటీవలే కరణ్ జోహార్ ఇంటర్వ్యూలో పెద్ది పాత్ర గురించి జాన్వీ కపూర్ చేసిన కామెంట్లు, జీవితంలో ఇలాంటి తప్పు పాత్ర…
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా టీడీపీ గూండాలు రిగ్గింగ్ కు పాల్పడ్డారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. కలెక్టర్లు,…