Movie News

శ్రీలీల & కృతిశెట్టి…. ఇద్దరికీ షాకే

టాలీవుడ్ హీరోయిన్లు శ్రీలీల, కృతి శెట్టి ఇద్దరికీ ఒకేసారి కోలీవుడ్ షాకులు తగిలాయి. పొంగల్ పండగ సందర్భంగా విడుదలైన వీళ్ళ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అనిపించుకోవడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

ముందు శ్రీలీల సంగతి చూస్తే పరాశక్తి మీద తను పెట్టుకున్న ఆశలు అన్నిఇన్ని కావు. 1960 బ్యాక్ డ్రాప్, అందులోనూ సుధా కొంగర లాంటి కల్ట్ డైరెక్టర్, హీరో శివ కార్తికేయన్ ఇంతకన్నా సెటప్ ఏం కావాలి. ఒకప్పుడు తమిళనాడుని ఊపేసిన హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని కాన్సెప్ట్ గా తీసుకున్న దర్శకురాలు దాన్ని అన్ని వర్గాలను మెప్పించేలా తీయకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది.

నటన పరంగా శ్రీలీల గ్లామర్ షో, డాన్సులు లేకుండా సిన్సియర్ గా చేసినప్పటికీ కంటెంట్ జనాలకు రీచ్ కాకపోవడంతో నిరాశ తప్పలేదు. అమరన్ సూపర్ హిట్ తర్వాత శివ కార్తికేయన్ కిది రెండో ఫ్లాప్.

ఇక కృతి శెట్టి విషయానికి వస్తే కార్తీతో జట్టు కట్టిన వా వతియార్ (అన్నగారు వస్తారు) అంచనాల్లో కనీసం సగం కూడా అందుకోలేక ఫైట్ చేస్తోంది. ఎంజిఆర్ రిఫరెన్స్ తో కొత్తగా ట్రై చేసిన దర్శకుడు నలన్ కుమారస్వామి కేవలం అభిమానులను మెప్పించడానికే ఆపసోపాలు పడ్డాడు. హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి పెర్ఫార్మన్స్ కి పెద్దగా స్కోప్ దక్కపోవడంతో ప్రేక్షకులు తన గురించి మాట్లాడుకునే ఛాన్స్ దొరకలేదు.

మొత్తానికి ఇద్దరికీ స్వీట్ షాక్ అయితే కొట్టింది. విచిత్రంగా తమిళ హీరోయిన్ నయనతార తెలుగుకు వచ్చి మన శంకరవరప్రసాద్ గారితో బ్లాక్ బస్టర్ కొడితే మనోళ్లు అక్కడికి వెళ్లి డిజాస్టర్లు చూశారు. ఇండస్ట్రీ విచిత్రాలు ఇలాగే ఉంటాయి.

శ్రీలీల, కృతి ఇద్దరికీ ఇవి తమిళ డెబ్యూలు కావడం గమనార్హం. కృతి మరో రెండు సినిమాలు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, జీనీలు సైతం ఏవేవో కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూనే ఉన్నాయి. అప్పుడైనా సక్సెస్ దక్కుతుందేమో చూడాలి. ఇక శ్రీలీల కార్తీక్ ఆర్యన్ తో చేసిన తొలి హిందీ సినిమా, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ ఏడాదే థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాయి.

This post was last modified on January 18, 2026 4:10 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బాబు సింగపూర్ లో దిగడమే ఆలస్యం…

దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మార్గం మ‌ధ్య‌లో జ్యురిచ్‌లో ఆగారు. షెడ్యూల్‌లో భాగంగా జ్యూరిచ్‌లోనూ ప‌లు కార్య‌క్ర‌మాల్లో…

33 minutes ago

మెగా అభిమానులు… ఉక్కిరి బిక్కిరే

మెగా అభిమానులు కొన్నేళ్ల నుంచి అంత సంతృప్తిగా లేరు. చిరు నుంచి ‘భోళా శంకర్’ లాంటి భారీ డిజాస్టర్ వచ్చింది.…

2 hours ago

కవిత ‘పీకే’ మంత్రం ఫలిస్తుందా?

సొంత పార్టీ పెట్టుకుంటాన‌ని ప్ర‌క‌టించిన బీఆర్ ఎస్ మాజీ నాయ‌కురాలు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత‌.. తన పార్టీకి…

3 hours ago

మారుతి… మళ్లీ తన స్టయిల్లో?

ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమకథా చిత్రమ్ లాంటి చిన్న సినిమాలతో సంచలనం సృష్టించి.. ఆపై నానితో చేసిన ‘భలే…

4 hours ago

`పాల‌న కోసం పుస్త‌కం` ప‌ట్ట‌నున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా నిత్యం ఎంతో బిజీగా ఉండే రేవంత్ రెడ్డి..పుస్త‌కాలు ప‌ట్టుకుని స్టూడెంట్ గా మార‌నున్నారు. నిజానికి త‌న‌కు ఒక్క‌రోజు…

4 hours ago

ఆ కుక్కలను నేను పెంచుకుంటా: రేణు దేశాయ్

వీధి శునకాలను అకారణంగా చంపుతున్నారని నటి రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ…

4 hours ago