శర్వానంద్ మళ్ళీ హిట్టు కొట్టాడు. సంక్రాంతి సెంటిమెంట్ కి మరింత బలం చేకూరుస్తూ నారి నారి నడుమ మురారితో మరొక విజయం ఖాతాలో వేసుకున్నాడు. పోటీ మరీ తీవ్రంగా ఉండటంతో కలెక్షన్ల పరంగా కొంచెం నెంబర్లు తక్కువగా కనిపిస్తూ ఉండొచ్చు కానీ పండగ చివర్లో వచ్చినా, ఇంత రెస్పాన్స్ తెచ్చుకోవడం చూస్తే శర్వా మామూలోడు కాదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన ఈ ఎంటర్ టైనర్ కు వీలైనన్ని థియేటర్లు వచ్చేలా చేయడంలో టీమ్ చాలానే కష్టపడింది. రెండో వారం నుంచి భారీ మొత్తంలో స్క్రీన్లు పెరుగుతాయనే నమ్మకం బలంగా ఉంది.
అయితే ఒకటి మాత్రం నిజం. నారి నారి నడుమ మురారి లాంటి కంటెంట్ ఉన్న కామెడీ సినిమాలు సోలోగా రావాలి. అప్పుడే అధిక శాతం ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. ఇప్పుడు పండగ హడావిడిలో వసూళ్లు వేగంగా వచ్చి షేర్లు కనిపిస్తాయి కానీ లాంగ్ రన్ కు స్కోప్ ఉండే ఇలాంటి వాటికి మంచి ప్లానింగ్ అవసరం.
సామజవరగమనకు కాంపిటీషన్ లేకపోవడం వల్లే పెద్ద విజయం సాధించిందనేది కాదనలేని వాస్తవం. కానీ నారి నారికి ఆ ఛాన్స్ లేకుండా పోయింది. మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, రాజా సాబ్ వల్ల స్క్రీన్ కౌంట్ లో బాగా వ్యత్యాసం వచ్చేసింది.
హిట్టు స్టాంప్ పడింది కానీ దాని పూర్తి కెపాసిటీ బయట పడుతుందా లేదానేది ఇంకో వారం రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. బ్రేక్ ఈవెన్ పరంగా సులభంగానే టార్గెట్ అందుకునేలా ఉంది కానీ, లాభాలు ఎంత శాతంలో వస్తాయనేది వేచి చూడాలి.
ఒకవేళ వచ్చిన సినిమాల్లో కనీసం రెండు మూడింటికి నెగటివ్ టాక్ వచ్చి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ రాజా సాబ్ మినహాయించి అన్నింటికి డీసెంట్ నుంచి బ్లాక్ బస్టర్ దాకా పాజిటివ్ ముద్ర పడింది. ఇది కూడా నారి నారి నడుమ మురారికి ఇబ్బందిగా మారింది. ఏదైతేనేం ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి సెంటిమెంట్ కొనసాగిస్తూ శర్వా సంక్రాంతి హ్యాట్రిక్ అయితే కొట్టేశాడు.
This post was last modified on January 18, 2026 6:38 am
మెగా అభిమానులు కొన్నేళ్ల నుంచి అంత సంతృప్తిగా లేరు. చిరు నుంచి ‘భోళా శంకర్’ లాంటి భారీ డిజాస్టర్ వచ్చింది.…
సొంత పార్టీ పెట్టుకుంటానని ప్రకటించిన బీఆర్ ఎస్ మాజీ నాయకురాలు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత.. తన పార్టీకి…
ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమకథా చిత్రమ్ లాంటి చిన్న సినిమాలతో సంచలనం సృష్టించి.. ఆపై నానితో చేసిన ‘భలే…
తెలంగాణ ముఖ్యమంత్రిగా నిత్యం ఎంతో బిజీగా ఉండే రేవంత్ రెడ్డి..పుస్తకాలు పట్టుకుని స్టూడెంట్ గా మారనున్నారు. నిజానికి తనకు ఒక్కరోజు…
వీధి శునకాలను అకారణంగా చంపుతున్నారని నటి రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ…
మార్చిలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 కోసం క్రికెట్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తుండగా, ఈ మెగా టోర్నీపై తరచుగా వచ్చే…