నిన్న లోకేష్ కనగరాజ్ అనౌన్స్ మెంట్ వచ్చాక అల్లు అర్జున్ సినిమాల గురించి మరోసారి చర్చ మొదలయ్యింది. ఎందుకంటే అట్లీది పూర్తయ్యేలోగా అక్టోబర్ దాటిపోవచ్చు. వచ్చే ఏడాది రిలీజ్ అంటే సంక్రాంతి లేదా వేసవి టార్గెట్ చేస్తారు. అక్కడో రెండు మూడు నెలలు ప్రమోషన్లకు కేటాయించాల్సి ఉంటుంది.
ఇప్పుడు అఫీషియల్ గా ప్రకటించిన లోకేష్ మూవీని ఈ ఏడాదే మొదలుపెట్టినా 2028 కన్నా ముందు రిలీజయ్యే ఛాన్స్ లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టు పెండింగ్ లో ఉంది. ఇది ఇంకా డిస్కషన్ స్టేజిలో ఉందని ఒకసారి, లేదూ పక్కాని మరోసారి రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇక అసలు ట్విస్ట్ వేరే ఉంది.
పుష్ప 2 తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా టి సిరీస్ సంస్థ ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. ఇది జరిగి రెండు సంవత్సరాలు దాటిపోయాయి. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేవు. యానిమల్ తర్వాత రెండేళ్లు స్పిరిట్ కు కేటాయించిన వంగా అదయ్యాక యానిమల్ పార్క్ చేస్తారనే లీక్ ముంబై వర్గాల్లో జోరుగా తిరుగుతోంది.
రామ్ చరణ్ లేదా చిరంజీవితో ఒక సినిమా వంగా లిస్టులో ఉందట. అలాంటప్పుడు బన్నీతో అనుకున్న మూవీ ఏమైందన్న ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి బన్నీ వంగా మూవీకి ఓకే చెప్పిన సంగతి అభిమానులే మర్చిపోయారు. అంత పాతబడిపోయింది న్యూస్.
ఇప్పుడీ కాంబో ఉంటుందా లేదా అనేది వేయి డాలర్ల ప్రశ్న. సమాధానం కూడా ఇప్పట్లో దొరికేలా లేదు. ఒకవేళ చేయాలి అనుకుంటే అదేదో మరోసారి క్లారిటీ ఇస్తే బెటర్. సెలక్షన్ విషయంలో చాలా కఠినంగా ఉంటున్న బన్నీ తెలుగు దర్శకుల కంటే తమిళ డైరెక్టర్లకే ప్రాధాన్యం ఇస్తున్నాడు.
అందుకే అట్లీ తర్వాత లోకేష్ కనగరాజ్ లాక్ అయ్యారు. అయితే సందీప్ వంగా చెప్పిన కథ సంతృప్తికరంగా అనిపించలేదా లేక ఆ స్థాయిలో స్టోరీ సిద్ధం కాలేదా అనేది అంతు చిక్కని సస్పెన్స్. సందీప్ వంగా చూపించే వైల్డ్ క్యారెక్టరైజేషన్ లో అల్లు అర్జున్ ని ఊహించుకున్న ఫ్యాన్స్ కోరిక తీరుతుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.
This post was last modified on January 15, 2026 11:44 am
మెగాస్టార్ చిరంజీవి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ ఎలాంటి విధ్వంసం సృష్టించగలరో ‘మన శంకర వరప్రసాద్…
సంక్రాంతి వస్తే చాలు పతంగులు ఎగురవేసేందుకు చిన్నా, పెద్దా అంతా ఆసక్తి చూపుతుంటారు. అయితే, దారంతో కాకుండా చైనా మాంజాతో…
పండగ చివర్లో వచ్చిన సినిమా నారి నారి నడుమ మురారి. ప్రీమియర్లు పడే దాకా అండర్ డాగ్ గా ఉంటూ…
రాజకీయ రంగప్రవేశానికి ముందు చివరి సినిమాగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న జన నాయకుడుకి మోక్షం ఎప్పుడో అర్థం కాక అభిమానులు…
ఇది కేరళ కాదు… ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్రేయపురం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆత్రేయపురంలో పండుగ వాతావరణం నెలకొంది అంటూ మంత్రి నారా…
2026 బాక్సాఫీస్ సంక్రాంతి ప్రధాన ఘట్టం అయిపోయింది. మొత్తం అయిదు సినిమాల స్క్రీనింగ్లు అయిపోయాయి. టెక్నికల్ గా నారి నారి…