Movie News

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరచకలేకపోవడంతో రేసులో వెనుకబడిన వైనం తెలిసిందే. ప్రభాస్ ఇమేజ్ రక్షణ కవచంలా ఉండటంతో రెండు వందల కోట్ల మార్కు ఈజీగా దాటేసింది కానీ లేదంటే లెక్క వేరుగా ఉండేది.

విడుదలకు ముందు చాలా కాన్ఫిడెన్స్ చూపించిన దర్శకుడు మారుతీ ఇప్పుడు కూడా గొప్ప సినిమా అంటున్నారే తప్ప పొరపాటు ఎక్కడ జరిగిందో గుర్తించడం లేదు. అది ఒప్పుకోవడానికి ఇది సరైన సమయం కాదు కానీ ఆశించిన రిజల్ట్ రాకపోవడానికి కొత్త అర్థం చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ప్రేక్షకులు పండగ మూడ్ లో ఉండటం వల్ల సినిమాని అర్థం చేసుకోలేకపోయారని, అదే వేరే టైంలో రిలీజ్ చేసి ఉంటే క్లైమాక్స్ గురించి ఎంతో కాలం చర్చించుకునేవాళ్ళని అన్నారు. సరే కాసేపు ఈ పాయింట్ నిజమే అనుకుందాం. అలాంటప్పుడు పుష్ప 2, యానిమల్ లాగా డిసెంబర్ మొదటి వారంలోనే విడుదల చేసి ఉండొచ్చు.

కానీ ప్రకటించి మరీ వాయిదా వేశారు. ఏదో పోస్ట్ ప్రొడక్షన్ వల్ల లేట్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే నిర్మాత విశ్వప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో బయ్యర్లు సంక్రాంతికి అయితే ఎక్కువ రెవిన్యూ వస్తుందని చెప్పడం వల్లే వాళ్ళ కోరిక మేరకు నిర్ణయం మార్చుకున్నామని వివరించారు.

తీరా చూస్తే ఇప్పుడు రెగ్యులర్ కమర్షియల్ ప్యాట్రన్ లో వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ అయిపోగా మిగిలినవి కూడా డీసెంట్ టాక్ తెచ్చుకునే పనిలో ఉన్నాయి. ఎటొచ్చి రాజా సాబే ఎదురీదుతోంది. ఉత్తరాదిలో పరిస్థితి మరీ అన్యాయంగా ఉంది.

తగిన రిపేర్లు, ఎడిటింగులు చేసుకుని వేరే టైంలో సోలోగా వచ్చి ఉంటే నిజంగా రాజా సాబ్ రిజల్ట్ చాలా బెటర్ గా ఉండేదేమో. విపరీతమైన నమ్మకంతో పోటీని తక్కువంచనా వేయడం వల్ల ఇప్పుడిలా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే అసలు నిప్పు ఎక్కడ రాజుకుంటుందో ముందే గుర్తించి ఉంటే బాగుండేది. 

This post was last modified on January 14, 2026 8:04 am

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

50 minutes ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

60 minutes ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

2 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

2 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

3 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

5 hours ago