మీటూ వల్ల ఇంతకుముందు లైంగిక వేధింపులు ఎదుర్కొన్న అమ్మాయిలకు ఏమాత్రం న్యాయం జరిగిందో ఏమో కానీ.. దీని వల్ల పరిశ్రమలో ఎంతో కొంత మార్పు వచ్చి మహిళలపై వేధింపులు తగ్గాయన్నది వాస్తవం. అవకాశాల పేరుతో అమ్మాయిలకు వల వేసే వారిలో భయం పుట్టేలా చేసింది మీటూ ఉద్యమం. అలాగే హీరోయిన్ల పట్ల కఠినంగా వ్యవహరించడం కూడా తగ్గినట్లే కనిపిస్తోంది. ఈ మూమెంట్ తనకు కూడా పరోక్షంగా సాయపడిందని నటి సాయిపల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మీ టూ వల్లే తాను ఓ సినిమాలో లిప్ లాక్ తప్పించుకోగలిగానని ఆమె చెప్పడం విశేషం.
లిప్ లాక్, ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించడం తనకు ఇష్టం ఉండదని.. కానీ కొంత కాలం కిందట నటించిన ఓ సినిమాలో హీరోతో లిప్ లాక్ సీన్ చేయమని తనకు దర్శకుడు చెప్పాడని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. ఐతే తాను ఆ సన్నివేశం చేయలేనని చెప్పగా.. దర్శకుడు మళ్లీ మళ్లీ అడిగాడని.. ఇంతలో హీరో కలుగజేసుకుని.. ‘ఆమెను బలవంతం చేయకండి. ఇష్టం లేకుంటే వదిలేయండి. తను తర్వాత బయటికెళ్లి మీటూ అంటే మనం ఇబ్బందుల్లో పడతాం’ అన్నాడని సాయిపల్లవి వెల్లడించింది.
నిజానికి తనకలాంటి ఉద్దేశం లేకపోయినప్పటికీ.. ఆ నటుడు చెప్పిన మాటతో దర్శకుడు సైలెంట్ అవడమే కాక.. తన దగ్గరికొచ్చి లిప్ లాక్ సీన్ గురించి సరదాగానే అన్నట్లు చెప్పాడని సాయిపల్లవి వివరించింది. అలా తాను మీటూ ఉద్యమం వల్ల లిప్ లాక్ తప్పించుకున్నట్లు చెప్పింది. ఇప్పటిదాకా సాయిపల్లవి ఏ సినిమాలోనూ గ్లామర్ ఒలకబోసింది లేదు. హద్దులు దాటి నటించింది లేదు. లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్ల లాంటివి ప్రేక్షకులు కూడా ఆమె నుంచి అస్సలు ఊహించరు.
This post was last modified on December 14, 2020 10:51 am
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…