Movie News

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా పరిణామాలు వేగమందుకున్నాయి. రాజా సాబ్ కు మిక్స్డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో కుటుంబ ప్రేక్షకులు ఇప్పుడు మెగా మూవీ మీద కన్నేస్తున్నారు. యుఎస్ లో అంచనాలకు మించి అడ్వాన్స్ బుకింగ్స్ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

మిలియన్ చేరుకోవడం గురించి బలమైన అంచనాలున్నాయి. ట్రైలర్ మీద మిశ్రమ స్పందన కనిపించినప్పటికీ హుక్ స్టెప్ సాంగ్ వచ్చాక హైప్ అమాంతం మారిపోయింది. చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు మొదటి రోజు బిగ్ నెంబర్స్ ఆశిస్తున్నారు.

మెగాస్టార్ ప్లస్ దర్శకుడు అనిల్ రావిపూడి బ్రాండ్ క్షేత్ర స్థాయిలో పెద్ద ఎత్తున పని చేస్తున్నాయి. ఆ బజ్ తాలూకు సౌండ్ సోషల్ మీడియాలో కనిపించకపోవచ్చు కానీ గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాంకి మహారాజ పోషకులుగా మూడు వందల కోట్లు ఇచ్చింది కుటుంబ ప్రేక్షకులే.

అందుకే టీమ్ చాలా ధీమాగా ఉంది. వెంకటేష్ క్యామియో ఇరవై నిముషాలు ఉన్నప్పటికీ ఇప్పటిదాకా కేవలం ఒక్క షాట్, మెగా విక్టరీ సాంగ్ లో మాత్రమే రివీల్ చేశారు. ఎమోషన్, చైల్డ్ కామెడీ, చిరు వెంకీ కాంబో ఎపిసోడ్ తాలూకు సర్ప్రైజులు బయటికి రాలేదు. ఇంకో రెండు పాటలు ఉన్నాయని, అవి నేరుగా థియేటర్లలో బ్లాస్ట్ అవుతాయని వినికిడి.

సంక్రాంతి పోటీలో మొదటి పుంజు రాజా సాబ్ ఏ దిశగా వెళ్తోందో క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఇక నెక్స్ట్ మన శంకరవరప్రసాద్ గారు ఏం చేస్తారనే దాని మీద ఇండస్ట్రీ వర్గాలు వెయిట్ చేస్తున్నాయి. భీమ్స్ పాటలు తమకిచ్చిన డ్యూటీ పూర్తి చేశాయి.

నయనతార ముందు చేసిన ప్రమోషన్లు కాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా రాకపోయినా పెద్ద ఇబ్బందేమీ లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అసలా లోటే కనిపించలేదు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా చిరంజీవి, కర్ణాటక నుంచి వచ్చిన వెంకీ గౌడగా వెంకటేష్ నటించిన ఈ హిలేరియస్ మల్టీస్టారర్ టాక్ రేపు అర్ధరాత్రి లోపే వచ్చేస్తుంది. చూడాలి ఏం చేస్తుందో.

This post was last modified on January 10, 2026 1:00 pm

Share
Show comments
Published by
Kumar
Tags: ChiruFeature

Recent Posts

అంబటి ఇంటిపై దాడి… హై టెన్షన్

ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…

7 minutes ago

భాగ్య‌న‌గ‌రంలో గ‌న్ క‌ల్చ‌ర్.. డేంజ‌రే!

తెలంగాణ ప్ర‌భుత్వం... పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ‌ధామంగా మారుస్తామ‌ని చెబుతున్న హైద‌రాబాద్‌లో గ‌న్ క‌ల్చ‌ర్ పెరుగుతోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. వ్య‌క్తిగ‌తంగా…

8 minutes ago

‘చంద్రబాబును తిట్టలేదు.. అరెస్ట్ చేస్తే చేసుకోండి’

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న…

41 minutes ago

టాలీవుడ్… వెయ్యి కోట్ల క్లబ్‌పై కన్నేసిన క్రేజీ మూవీస్

తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు కేవలం సౌత్ ఇండియాకో లేదా దేశానికో పరిమితం కాలేదు. గ్లోబల్ మార్కెట్‌లో టాలీవుడ్ సృష్టించిన…

48 minutes ago

గ్రౌండ్ లెవెల్ పై రేవంత్ రెడ్డి దృష్టి

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. రెండు సంవ‌త్స‌రాల పాల‌న‌కు ఈ ఎన్నిక‌ల‌ను రిఫ‌రెండంగా భావిస్తున్న రేవంత్…

3 hours ago

బాబు గారి మూడు కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం…

4 hours ago