Movie News

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది. రేపు థియేటర్లలో అడుగు పెట్టనుంది. అయితే తెలుగు వెర్షన్ రిలీజ్ కావడం లేదు. థియేటర్ల కొరత, స్ట్రెయిట్ సినిమాల పోటీ, సెన్సార్ ఆలస్యం తదితర కారణాల వల్ల ఏపీ తెలంగాణ విడుదల వాయిదా వేసుకున్నారు.

సరే ఇది ఒక రకంగా మంచి నిర్ణయమే కానీ డబ్బింగ్ వెర్షన్ లేట్ కావడం వల్ల మన ఆడియన్స్ కి పరాశక్తి తమిళ టాక్, రివ్యూలు ముందుగానే తెలుసుకునే అవకాశం దక్కుతుంది. హిట్టయితే సంతోషమే కానీ ఏమాత్రం అటుఇటు అయినా ఇక్కడ ఓపెనింగ్స్ ఆశించడం కష్టమవుతుంది.

దర్శకురాలు సుధా కొంగర కంటెంట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఒకప్పుడు తమిళనాడుని ఊపేసిన హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకోవడం వల్ల పొలిటికల్ గా ఇందులో కొన్ని కాంట్రవర్సిలు పెట్టారు. వాటిని కుదించడంతో పాటు పాతిక దాకా కట్స్ కి అంగీకారం తెలిపి టీమ్ ముందుకు వెళ్తోంది.

కీలకమైన పొంగల్ పండక్కు సరైన సినిమా లేదని అక్కడి మూవీ లవర్స్ బాధ పడుతున్న టైంలో పరాశక్తికి క్లియరెన్స్ రావడం జాక్ పాట్ అనే చెప్పాలి. ఎందుకంటే కాంపిటీషన్ లేకపోవడం వల్ల అనుకున్న దానికన్నా రెట్టింపు నెంబర్లతో వసూళ్లు రాబోతున్నాయనేది వాస్తవం.

హీరోయిన్ శ్రీలీల మాత్రం తెగ ఫీలైపోతోంది. ఎందుకంటే రెగ్యులర్ హీరోయిన్ కాకుండా నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇందులో చేసింది. కానీ తెలుగు ఫ్యాన్స్ ని చూసే అవకాశం లేకపోవడం వల్ల మన రెస్పాన్స్ తెలుసుకునే ఛాన్స్ ఉండదు. హైదరాబాద్ లో కూడా తమిళ వెర్షన్  రిలీజ్ చేయడం లేదు.

కోలీవుడ్ లో యునానిమస్ టాక్ వస్తేనే పరాశక్తికి ఇక్కడ బజ్ సంపాదించుకోవచ్చు. రెండేళ్ల క్రితం శివ కార్తికేయన్ అయలన్ వాయిదా పడి చివరికి థియేటర్లకు రాకుండానే ఇటీవల ఓటిటి ప్రీమియర్ జరుపుకుంది. పరాశక్తికి అలాంటి పరిస్థితి రాకూడదని మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. రేపీపాటికి ఫుల్ రిపోర్ట్స్ వచ్చేసి ఉంటాయి.

This post was last modified on January 9, 2026 5:20 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

10 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

4 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

6 hours ago