వెండితెరకు చాలా గ్యాప్ తీసుకున్న సమంత త్వరలో మా ఇంటి బంగారంతో కంబ్యాక్ అవుతోంది. జీవిత భాగస్వామి రాజ్ నిడిమోరు సృష్టించిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ టీజర్ కం ట్రైలర్ ని విడుదల చేశారు. సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయనప్పటికీ కంటెంట్ మీద ఒక అవగాహన ఇస్తే థియేటర్ బిజినెస్ తో పాటు ఓటిటి డీల్స్ ని సెట్ చేసుకోవచ్చనే ఉద్దేశంతో ప్రమోషన్లు మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది.
అన్నీ మంచి శకునములే తర్వాత కొంత కాలం మాయమైన నందిని రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కథని వీలైనంత వరకు ఓపెన్ గా చెప్పే ప్రయత్నం చేశారు. డిఫరెంట్ గానే ఉంది.
కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయి (సమంత) భర్త వద్దంటున్నా అత్తవారింటికి వెళ్తుంది. అక్కడ మనుషులందరూ పైకి మాములుగా పద్దతిగా కనిపించినా వాళ్లంతా అదో రకం. ముందు సామ్ ని తక్కువంచనా వేస్తారు. కానీ ఆమె వచ్చింది కేవలం కాపురం చేయడం కోసం కాదని, తన వెనుక ఏదో హింసాత్మక బ్యాక్ గ్రౌండ్ ఉందని తెలుకోలేకపోతారు.
తన మిషన్ లో భాగంగా చీరకట్టులోనే వెళ్లి శత్రువులను చంపడం, ఇంటి మీదకు దాడి చేసిన గ్యాంగ్ ని తుపాకులతో కాల్చి చంపడం లాంటివి చేస్తుంది. అసలు బంగారం ఎవరు, వెనకాల ఉన్న చీకటి కోణం ఏంటి, ఆ ఊరికి ఏ రహస్యం కోసం వచ్చిందనేది తెరమీద చూడాలి.
పాయింట్ అయితే వినూత్నంగానే ఉంది. పద్దతిగా ఉంటూ వెనకాల వయొలెంట్ బ్యాక్ డ్రాప్ హీరోయిన్ కి పెట్టడం క్రియేటివ్ థాట్. బాషాలో రజనీకాంత్ రేంజ్ లో పైకి సౌమ్యంగా ఉంటూ అవసరమైన టైంలో హింసాత్మకంగా మారే తరహాలో దీన్ని డిజైన్ చేశారు కాబోలు.
తక్కువ బడ్జెట్ లో పెద్దగా హడావిడి లేకుండా రూపొందిన మా ఇంటి బంగారం అంచనాలు రేపడంలో సక్సెస్ అయ్యిందని చెప్పాలి. ప్రత్యేకంగా గుర్తింపు ఉన్న హీరోని తీసుకోకుండా మొత్తం సామ్ వన్ విమెన్ షో లాగా దీన్ని తీర్చిదిద్దారు. మొత్తానికి సమంత అభిమానుల ఎదురుచూపులు ఫలించి త్వరలోనే ఫుల్ లెన్త్ రోల్ లో దర్శనమివ్వనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates