ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ జిఓ త్వరగా వచ్చేయడంతో 1000 రూపాయల ఫ్లాట్ రేట్ తో టికెట్ల అమ్మకాలు మొదలైపోయాయి. సెంటర్ కెపాసిటీనిని బట్టి కొన్ని చోట్ల 800, 600 ధరలు కూడా పెట్టారు. రేపటి నుంచి ప్రభుత్వం అనుమతించిన ప్రకారం పది రోజుల పాటు ఏపీ హైక్స్ అమలులో ఉంటాయి.
అంటే పండగ అయిపోయే వరకు రాజా సాబ్ ని రెగ్యులర్ రేట్లతో చూడటం సాధ్యం కాదు. గతంలో పుష్ప 2కి కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. ఇక తెలంగాణ బుకింగ్స్ కోసం ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు కానీ జిఓ వల్ల అంతకంతా ఆలస్యమవుతూనే ఉంది.
ఇదిలా ఉండగా రాజా సాబ్ చుట్టూ చాలా ఇష్యూస్ ఉన్నాయి. నైజామ్ లో సింగల్ స్క్రీన్లు దక్కలేదనే అంశం మీద ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆగ్రహంతో ఉన్నారు. కూకట్ పల్లి లాంటి కీలకమైన ప్రాంతాల్లో ఒక్క థియేటర్ ఇవ్వకపోవడం గురించి సోషల్ మీడియా వేదికగా నిరసన తెలియజేస్తున్నారు.
వీలైనంత త్వరగా సాల్వ్ చేస్తామని నిర్మాత విశ్వప్రసాద్ హామీ ఇస్తున్నారు కానీ అంత ఈజీగా తెలేలా లేదు. ఇది కాసేపు పక్కనపెడితే ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలతో మొదలు ట్విట్టర్, ఇన్స్ టా, ఫేస్ బుక్ తదితర సామజిక మాధ్యమాలు రాజా సాబ్ టాక్ తో హోరెత్తబోతున్నాయి. అఫ్కోర్స్ వాటిలో స్పాయిలర్స్ ఉండే ఛాన్స్ లేకపోలేదు.
నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందినట్టు చెబుతున్న రాజా సాబ్ 2026లో వస్తున్న తొలి ప్యాన్ ఇండియా మూవీ. ఈ కారణంగానే బయ్యర్ వర్గాలు బోలెడు ఆశలు పెట్టుకున్నాయి. దీంతో మొదలుపెట్టి వరసగా రాబోయే సినిమాలతో రెండు మూడు వారాలు థియేటర్లు కళకళలాడతాయని కోరుకుంటున్నారు.
ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ సులభంగా దాటేసిన రాజా సాబ్, నైజామ్ అమ్మకాలు మొదలుకాకుండానే గంటకు ఏడు వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం శుభసూచకం. మొదటిసారి హారర్ జానర్ టచ్ చేసిన ప్రభాస్ ని దర్శకుడు మారుతీ వింటేజ్ రూపాల్లో చూపించబోతున్నారు. కనెక్ట్ అయితే మాత్రం బాక్సాఫీస్ జాతరే.
This post was last modified on January 8, 2026 1:23 pm
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…