మన శంకరవరప్రసాద్ గారు ప్రమోషన్లలో చివరి ఘట్టం పూర్తయ్యింది. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. నాలుగు దశాబ్దాలకు పైగా నట ప్రయాణంలో ఈ ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఇంత టైం పట్టడం ఆశ్చర్యమే అయినా, అనిల్ రావిపూడి లాంటి ఎంటర్ టైనింగ్ దర్శకుడి ద్వారా అది జరగడం అభిమానులకు మరింత కిక్ ఇస్తోంది.
ఇక వేడుకలో అట్రాక్షన్లు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా హుక్ స్టెప్ ని లాంచ్ చేయడం, అందులో మెగాస్టార్ వింటేజ్ స్టెప్స్ కనిపించడం ఆడిటోరియంలో ఉన్న ఫ్యాన్స్ ని ఊపేసింది.
ఆ పాట ప్లే అవుతున్నప్పుడు చిరంజీవికి దగ్గరగా వెంకటేష్, అనిల్ రావిపూడి ఆనందంతో డాన్స్ చేయడం, ఆ తర్వాత చిరు వెంకీ ఆత్మీయంగా కౌగిలించుకోవడం మరో మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది.
ప్రసంగాల విషయానికి వస్తే తమ్ముళ్లు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తో నటించానని, ఇప్పుడు అన్నయ్య చిరంజీవితో నటించడం గురించి వెంకటేష్ తన ఆనందాన్ని పంచుకున్నారు. సంక్రాంతికి వస్తున్న రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి, ప్రభాస్ ఇలా అందరి సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని, అప్పుడే పరిశ్రమ సుభిక్షంగా ఉంటుందని చిరంజీవి తన ఆకాంక్షను వెలిబుచ్చడం మరో ముఖ్యమైన విషయం.
అందరి సినిమాలు బాగా ఆడాలనే ఉద్దేశంతో మెగా విక్టరీ సాంగ్ లో లిరిక్స్ ని మార్చడం గురించి చిరంజీవి ప్రస్తావించడం మరో హైలైట్. ఇద్దరితో ఫుల్ లెన్త్ మల్టీస్టారర్ చేయాలనే కోరిక రావిపూడి స్టేజి మీద వ్యక్తం చేస్తే దానికి మెగాస్టార్ నుంచి సానుకూల సంకేతం రావడం గమనించాల్సిన అంశం.
మీసాల పిల్ల పాట, తోటి నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి విడమరిచి చెప్పిన చిరంజీవి చాలా హుషారుగా యూత్ ఫుల్ గా కనిపించారు. మొత్తానికి మెగా విక్టరీ ఈవెంట్ ఫ్యాన్స్ కి కావాల్సిన జోష్ అయితే ఇచ్చింది. ఇక జనవరి 12 థియేటర్లలో జరగబోయే సంబరాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.
This post was last modified on January 7, 2026 10:36 pm
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…