చాలా గ్యాప్ తర్వాత సమంతా ఫుల్ లెన్త్ మూవీతో రాబోతోంది. తనే నిర్మించిన శుభంలో చిన్న క్యామియో చేసినప్పటికీ అది ఫ్యాన్స్, ఆడియన్స్ కి పెద్దగా రిజిస్టర్ కాలేదు. సిటాడెల్ హానీ బన్నీ వెబ్ సిరీస్ కూడా ఆశించిన స్పందన తెచ్చుకోలేకపోయింది.
ఈ నేపథ్యంలో తనను పూర్తి పాత్రలో స్క్రీన్ మీద చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోరిక నెరవేరబోతోంది. సామ్ తో ఓ బేబీ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకురాలు నందిని రెడ్డితో కలిసి మా ఇంటి బంగారంగా త్వరలోనే థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఎల్లుండి జనవరి 9 టీజర్ తో తన పాత్రను పరిచయం చేయడానికి ముహూర్తం పెట్టుకున్నారు.
అంతా బాగానే ఉంది కానీ అదే రోజు ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్ ఉంది. ముందు రాత్రి ప్రీమియర్ల నుంచే దీని తాలూకు హడావిడి ఓ రేంజ్ లో ఉంటుంది. టాక్స్, రివ్యూస్, స్పాయిలర్స్ ఇలా మాములు హంగామా ఉండదు. అందులోనూ ప్రభాస్ చాలా గ్యాప్ ఇచ్చేశాడు.
కల్కి 2898 ఏడి తర్వాత కన్నప్ప గెస్ట్ రోల్ తప్ప తెరమీద కనిపించలేదు. అందుకే రాజా సాబ్ తమ ఆకలి తీరుస్తుందనే నమ్మకంతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అలాంటప్పుడు మా ఇంటి బంగారం అదే సమయాన్ని ఎంచుకుంది. అది కూడా ఉదయం పది గంటలకు. ఈ ముహూర్తమంటే కోరుకున్నంత అటెన్షన్ రాకపోయే రిస్క్ ఉంది.
ఎలాగూ జనవరి 10 సినిమాలేం లేవు. తిరిగి 12 నుంచి క్యూ కట్టాయి. అలాంటప్పుడు మధ్యలో స్లాట్ ఎంచుకోవాలి కానీ ఇలా ఎందుకు నిర్ణయించుకున్నారో కంటెంట్ చూస్తే కానీ క్లారిటీ రాదు. టైటిల్ హోమ్లీగా ఉన్నప్పటికీ మా ఇంటి బంగారంలో క్రైమ్, రివెంజ్ ఎలిమెంట్స్ ప్రధానంగా ఉంటాయట.
సంతోష్ నారాయణన్ సంగీతం మరో ఆకర్షణ కానుంది. సమంత జీవిత భాగస్వామి రాజ్ నిడుమూరు పర్యవేక్షణలో మా ఇంటి బంగారం నిర్మాణం జరిగింది. సినిమా రిలీజ్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ సమ్మర్ ని టార్గెట్ చేసుకుంటున్నారు. టీజర్ తో పాటు విడుదల తేదీని ఏమైనా రివీల్ చేస్తారేమో చూడాలి.
This post was last modified on January 7, 2026 6:24 pm
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిట్…
ఈ రోజుల్లో ఓ పెద్ద సినిమా నుంచి ఒక చిన్న అప్‌డేట్ ఇవ్వాలంటే దానికి ఎంత హడావుడి చేస్తారో? అప్‌డేట్…
సెన్సెక్స్ మాదిరి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతున్న వైనం ఇటీవల కాలంలో చోటు చేసుకుంటుంది. ఉదయం ఉన్న ధర…