ఈ రోజు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు నిర్మాత దిల్ రాజు ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు. వెంకీ నుంచి గత ఏడాది వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఎఫ్-2’కు సీక్వెల్ అయిన ‘ఎఫ్-3’ ఫస్ట్ లుక్‌ను సడెన్‌గా లాంచ్ చేసేశాడు. ఈ సినిమా ఎప్పుడో ఖరారైంది. స్క్రిప్టు కూడా రెడీ అయింది. త్వరలో షూటింగ్ అంటున్నారు. కానీ ఇప్పుడే ఫస్ట్ లుక్ వచ్చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో ఈ పోస్టర్‌ను చూస్తే అర్థమైపోతుంది. ‘ఎఫ్-2’లో భార్యా భర్తల మధ్య గొడవలు, అపార్థాలు, అలకల నేపథ్యంలో కథ నడిస్తే.. ఈసారి డబ్బు చుట్టూ కథ నడిపించబోతున్నాడు అనిల్ రావిపూడి. వెంకీ, వరుణ్ ఇద్దరూ ట్రాలీ బాస్కెట్లలో బోలెడంత డబ్బు నింపుకుని వెళ్తున్నట్లుగా ఈ పోస్టర్ రూపొందించారు. టైటిల్లో, పోస్టర్ ఎక్కడ చూసినా డబ్బే డబ్బు.
“ఇష్యూ డబ్బులు అయినపుడు మరి ఫన్ పీక్స్‌లో ఉంటుందిగా.. అంతేగా అంతేగా..” అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ కూడా జోడించాడు అనిల్ రావిపూడి. డబ్బు చుట్టూ తిరిగే కామెడీ సినిమాలు గతంలో తెలుగులో చాలానే వచ్చాయి. ఈ మధ్య కాలంలో వాటి జోరు కొంచెం తగ్గింది. పాత కథల్నే తిరగేసి.. తనదైన కామెడీ జోడించి జనాల్ని ఎంటర్టైన్ చేయడం అనిల్ శైలి. ‘ఎఫ్-3’ విషయంలోనూ అదే చేయబోతున్నాడని స్పష్టమవుతోంది.
‘ఎఫ్-2’లో నటించిన తమన్నా, మెహ్రీన్ ఈ సినిమాలో కూడా వెంకీ, వరుణ్‌లతో జోడీ కట్టబోతున్నారు. వీరికి తోడు వేరే గ్లామర్ అట్రాక్షన్ కూడా ఉంటుందని అంటున్నారు. ఇందులో మరో హీరో కూడా నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఐతే పెద్దగా అంచనాల్లేకుండా వచ్చి ప్రేక్షకులు కోరుకున్న దాని కంటే ఎక్కువ వినోదాన్నందించింది ‘ఎఫ్-2’. ఐతే ఈసారి అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని అందుకోవడం అనిల్‌కు అంత తేలిక కాదు.
This post was last modified on December 13, 2020 2:01 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…