ఎల్లుండి విడుదల కాబోతున్న రాజా సాబ్ మన దగ్గర సౌండ్ చేయడంలో ఆశ్చర్యం లేదు కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా ఊపులోకి రాకపోవడం అభిమానులను ఖంగారు పెడుతోంది. బాలీవుడ్లో మన హీరోల్లో ఎవరికీ లేని మార్కెట్ ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. రాధే శ్యామ్ ఇక్కడ ఫెయిలైనా హిందీలో కమర్షియల్ గా పే చేసింది.
సలార్, కల్కిలు భారీ లాభాలిచ్చాయి. కొన్ని చోట్ల సాహో రికార్డులు భద్రంగా ఉన్నాయి. అలాంటిది రాజా సాబ్ కి ఏ రేంజ్ లో మార్కెటింగ్ చేయాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ముగ్గురు హీరోయిన్ల సాంగ్ ని వాళ్ళతోనే ప్రభాస్ లేకుండా ముంబైలో లాంచ్ చేయడం తప్ప వేరే ఏం చేయలేదు.
ఇలా జరగడానికి కారణాలు లేకపోలేదు. రాజా సాబ్ టీమ్ ఒత్తిడిలో ఉంది. దర్శకుడు మారుతీ ఇక్కడ ఇంటర్వ్యూలు ఇస్తూనే ఇంకో వైపు చివరి దశ పనులను చూసుకుంటూ ఏకంగా ల్యాబ్ లోనే పడుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఇంకోవైపు ప్రభాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడం, సందీప్ వంగాతో ఒక ఇంటర్వ్యూ చేయించుకోవడం మినహా వేరే దర్శనం లేదు.
సో ఉత్తరాది ప్రేక్షకులకు రాజా సాబ్ మీద పూర్తి స్థాయి ఆసక్తి కలగలేకపోవడానికి వీటినే అక్కడి విశ్లేషకులు రీజన్స్ గా చూపిస్తున్నారు. అఖండ 2 కోసం బాలయ్య, బోయపాటి శీను ఎన్ని టూర్లు వేశారో తెలిసిందే. అయినా అక్కడ అనుకున్న ఫలితం దక్కలేదు.
ఈ ధీమా ఎందుకంటే ప్రశ్నకు సమాధానం ఒకటే. రాజా సాబ్ కనక ఎక్స్ ట్రాడనరిగా ఉంటే ఎలాంటి పబ్లిసిటీ అక్కర్లేదు. జనాలు నెత్తిన బెట్టుకుంటారు. రిలీజ్ కు ముందు వరకు నెగటివ్ క్యాంపైన్ నడిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ అయ్యింది.
అసలే బాలీవుడ్ లో హారర్ జానర్ కు మంచి ఆదరణ ఉంది. స్త్రీ 2, ముంజ్యా, భూల్ భూలయ్యా 3 లాంటివి కనకవర్షం కురిపించాయి. అవన్నీ స్టార్లు లేని సినిమాలు. కానీ రాజా సాబ్ లో ప్రభాస్ ఉన్నాడు. సో బాగుందనే మాట వస్తే చాలు ఆటోమేటిక్ గా పికప్ అయిపోతుంది. కాకపోతే అది యునానిమస్ గా ఉంటేనే గట్టిగా నిలబడొచ్చు.
This post was last modified on January 7, 2026 12:18 pm
14 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ స్టేడియంలో బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. కేవలం ఒక ప్రామిసింగ్ ప్లేయర్ లా కాకుండా,…
సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ గారు నుంచి ఇటీవల రిలీజ్ చేసిన…
మూడేళ్లు వెనక్కి వెళ్తే.. తమిళ సీనియర్ నటుడు అర్జున్ దర్శకత్వంలో మొదలైన ఓ సినిమాకు ముందు ఓకే చెప్పి, తర్వాత…
రాయలసీమను రత్నాల సీమ చేస్తామని ఒకరు, రాయలసీమ కష్టాలు నావి, నేను వాటిని పరిష్కరిస్తానని మరొకరు… ఇలా ఏపీలో టీడీపీ…
కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజైనపుడు ఫ్లాప్ అవుతుంటాయి. కానీ టీవీల్లో, ఓటీటీల్లో వాటికి మంచి స్పందన వస్తుంటుంది. కాల క్రమంలో అవి కల్ట్ స్టేటస్…
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల రాజకీయాలు వద్దని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. రెండురాష్ట్రాలకూ నీటి సమస్యలు ఉన్నాయని..…