దశాబ్దం నుంచి బ్లాక్ బస్టర్ కోసం తపించిపోతున్న అఖిల్ ఆశలన్నీ ఇప్పుడు లెనిన్ మీదే ఉన్నాయి. షూటింగ్ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో రేపటి నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టబోతున్నారు. ఫస్ట్ లిరికల్ సాంగ్ పాజిటివ్ వైబ్స్ తేవడంతో అభిమానులకు ఉత్సాహం వచ్చేసింది.
అయితే సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయకుండా అప్పుడే పాటల పర్వం మొదలుపెట్టడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. నిర్మాత నాగవంశీ చెబుతున్న దాని ప్రకారం వేసవిని టార్గెట్ చేసుకున్నామని, అయితే టాక్సిక్, పెద్ది, డెకాయిట్, దురంధర్ 2, ప్యారడైజ్ ఉన్నందున వాటి షెడ్యూల్స్ ని బట్టి డిసైడ్ చేస్తామని అన్నారు.
అంటే లెనిన్ తెలివిగా ఖాళీ స్లాట్ కోసం ఎదురు చూస్తున్నాడన్న మాట. పైన చెప్పిన ప్యాన్ ఇండియా సినిమాలన్నీ ప్రస్తుతానికి చెప్పిన డేట్ కే వస్తామని చెబుతున్నాయి కానీ గ్యారెంటీగా మాట మీద ఎన్ని నిలబడి ఉంటాయని ఎవరూ చెప్పలేకపోతున్నారు.
ఎందుకంటే సోలో రిలీజ్ వస్తేనే సేఫ్ అయ్యే ప్రాజెక్టులవి. కానీ లెనిన్ కి అంత పెద్ద సమస్య లేదు. ఒకటి రెండు కాంపిటీషన్ ఉన్నా సరైన డేట్ దొరికితే పాజిటివ్ టాక్ తో వర్కౌట్ చేసుకోవచ్చు. వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళికిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన లెనిన్ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం సమకూర్చారు.
లెనిన్ ముందు చాలా సవాళ్లున్నాయి. ముఖ్యంగా ప్రొడక్షన్ పార్ట్ నర్ గా ఉన్న నాగార్జున తన కొడుకు సక్సెస్ ని ఈ సినిమా రూపంలో చూడాలని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ముందు హీరోయిన్ గా శ్రీలీలని తీసుకుని ఆ తర్వాత ఆమెను రీ ప్లేస్ చేసిన సంగతి తెలిసిందే.
రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూటెడ్ లవ్ స్టోరీగా రూపొందుతున్న లెనిన్ లో అభ్యుదయం, ప్రేమ, హింస, దైవత్వం, పోరాటం అన్నీ సమపాళ్లలో ఉంటాయట. పెర్ఫార్మన్స్ పరంగా అఖిల్ నుంచి బెస్ట్ వచ్చిందని యూనిట్ టాక్. తండేల్ తో నాగచైతన్య ఫామ్ లోకి వచ్చినట్టు లెనిన్ తో అఖిల్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
This post was last modified on January 5, 2026 5:41 pm
ఏపీలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయంలో సీఎం…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. అసెంబ్లీని బాయ్…
దర్శకుడు ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమాకు సంబంధించిన అయోమయం ఇంకా తొలగడం లేదు. హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్…
ఇవాళని మినహాయిస్తే జన నాయకుడు విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. ఇంకా సెన్సార్ సమస్యలు తొలగిపోలేదు. అధికారులు…
ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలన విషయం బయటపడింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) విడుదల చేసిన కొత్త…
మూవీ లవర్స్ పాతికేళ్ల క్రితమే కోరుకున్న కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం. కానీ రెండుసార్లు…