గత నవంబర్ లో విడుదలైన మలయాళ సినిమా ఎకో కేవలం అయిదు కోట్ల బడ్జెట్ తో రూపొంది యాభై కోట్లకు పైగా వసూళ్లతో ఔరా అనిపించింది. హైదరాబాద్ లో కొన్ని రోజులు నాన్ స్టాప్ గా హౌస్ ఫుల్ అయిన ఘనత దీనికి ఉంది. తెలుగు వెర్షన్ లేకపోయినా సబ్ టైటిల్స్ తో చూసి మరీ తమ ఆకలి తీర్చుకున్నారు మూవీ లవర్స్.
అప్పటి నుంచే దీని ఓటిటి రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తూ వచ్చారు. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. అన్ని ప్రధాన భాషల్లో అనువాదం చేయడంతో ఇబ్బంది తగ్గిపోయింది. ఇప్పుడీ మూవీకి సోషల్ మీడియాతో పాటు ఆఫ్ లైన్ లో పాజిటివ్ మద్దతు దొరుకుతోంది.
పచ్చిగా చెప్పాలంటే ఇదో కుక్కల మూవీ. అంటే ప్రత్యేకంగా హీరో ఎవరూ ఉండరు. కేవలం పాత్రలే ఉంటాయి. మనకు ప్రేమదేశం వినీత్ తప్ప గుర్తు పట్టే ఆర్టిస్టులు వేరే ఉండరు. కర్ణాటక కేరళ సరిహద్దుల్లో ఉండే ఒక ఎత్తయిన అడవి కొండ మీద కురియచన్ అనే వ్యక్తి కుక్కలను పెంచుకుంటూ వందల ఎకరాలు కొనేస్తాడు.
ఓ రోజు వయసైపోయిన భార్యను వదిలేసి మాయమైపోతాడు. ఆమెను చూసుకోడానికి జీతం మీద షీమోన్ అనే కుర్రాడు వస్తాడు. పోలీసులు, రకరకాల వ్యక్తులు కురియచన్ కోసం వెతుకుతూ ఉంటారు. అసలు అతను ఏమైపోయాడు, కొండ మీద ఉన్న ఇల్లు రహస్యం ఏంటి అనేదే అసలు స్టోరీ.
ఎకోని ఎందుకు చూడాలనే ప్రశ్న అడిగితే దానికి ఒకే సమాధానం టెక్నికల్ బ్రిలియన్స్. కథగా ఇది రెగ్యులర్ మల్లువుడ్ స్టైల్ లో నెమ్మదిగా సాగుతుంది. కానీ కాన్సెప్ట్ కి కనెక్ట్ అయితే మాత్రం ఫార్వర్డ్ చేయకుండా చూస్తాం. పాటలు, హీరోయిన్, లవ్ ట్రాక్, కామెడీ ఇవేవి లేకుండా కేవలం కుక్కలు, మాయమైపోయిన మనిషి చుట్టూ నడిపించిన క్రైమ్ డ్రామా ఆగకుండా చూసేలా చేస్తుంది.
ముఖ్యంగా లొకేషన్లు కళ్ళు పక్కకు తిప్పుకోనివ్వవు. కిష్కిందకాండం, సూక్ష్మదర్శిని లాంటి మలయాళీ స్లో థ్రిల్లర్లు నచ్చినవాళ్ళకు ఎకో మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఇవి అలవాటు లేని వాళ్ళు భరించడం కొంచెం కష్టమే.
This post was last modified on January 5, 2026 5:22 pm
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏ పెద్ద సినిమా రిలీజ్ కావాలన్నా బాక్సాఫీస్ కలెక్షన్ల కంటే ముందు టికెట్ రేట్ల పంచాయితీనే ఎక్కువగా…
తెలుగులో, అలాగే ఇతర భాషల్లో అనేక మంది దేవుళ్ల మీద సినిమాలు వచ్చాయి. శివుడి మీద అయితే సినిమాలకు లెక్కే…
ఏజెంట్ సినిమా మిగిల్చిన చేదు అనుభవం నుంచి అఖిల్ చాలా పెద్ద గుణపాఠమే నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్ గా నిర్మాత…
ఈ మధ్య స్టార్ హీరోల పారితోషకాలు బాగా పెంచేయడం.. అందుకు తగ్గట్లే సినిమాల బడ్జెట్లు పెరిగిపోవడం.. తీరా చూస్తే బిజినెస్, కలెక్షన్లు అనుకున్నంత…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎంతో ఎగ్జైట్ అవుతుంది. స్టార్ హీరోయిన్లు అయినా…
ఏటా జనవరి వస్తోంది.. పోతుంది... సంవత్సరాలు మారుతూ క్యాలెండర్ మారుతున్నాయి అంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల గుర్తు చేస్తున్నారు. ఇది…