Movie News

‘గంగోత్రి’ చూసి బయటికొచ్చాక బన్నీ ఛాలెంజ్

అల్లు అర్జున్‌ తొలి చిత్రం ‘గంగోత్రి’ పెద్ద హిట్. కానీ ఆ సినిమాలో బన్నీని చూసి విమర్శించిన వాళ్లే ఎక్కువమంది. తన లుక్స్ మీద చాలా నెగెటివ్ కామెంట్లు వచ్చాయి అప్పట్లో. ముఖ్యంగా బన్నీ వేసిన ఆడ వేషం కాల క్రమంలో ఒక ట్రోల్ మెటీరియల్‌గా మారింది. బన్నీ లుక్స్‌తో పాటు డైలాగ్ డెలివరీ విషయంలో కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి.

‘గంగోత్రి’లో తనను చూసి అతను పెద్ద స్టార్ అవుతాడని ఎవ్వరూ అనుకుని ఉండరు. కానీ రెండో సినిమా ‘ఆర్య’తో మొత్తం మారిపోయింది. నెగెటివిటీ అంతా పక్కకు వెళ్లిపోయింది. ఇక తర్వాతి రెండు దశాబ్దాల్లో ఇంతింతై అన్నట్లు బన్నీ ఎలా ఎదిగిపోయాడో తెలిసిందే. ఇందులో తన కష్టం, పట్టుదల గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఐతే ‘గంగోత్రి’ సినిమాను థియేటర్లో ప్రేక్షకుల మధ్య చూసి బయటికి వచ్చాక.. బన్నీ ఎంతో బాధ పడ్డాడట. కానీ అదే సమయంలో తాను ఇండియాలోనే బిగ్గెస్ట్ హీరోగా ఎదుగుతానని అతను శపథం చేశాడట. అప్పటికది తనకు అతిగా అనిపించింది అంటూ.. బన్నీకి క్లోజ్ ఫ్రెండ్ అయిన నిర్మాత బన్నీ వాసు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు.

‘‘బన్నీ గారికి మొదట్నుంచి తన సినిమాలను థియేటర్లలో చూడడం, ప్రేక్షకుల స్పందన తెలుసుకోవడం అలవాటు. ఇప్పటికీ క్యాప్ పెట్టుకుని, ముఖానికి మాస్కు వేసుకుని థియేటర్లకు వెళ్లి వస్తుంటారు. ‘గంగోత్రి’ సినిమా రిలీజైనపుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని తిరుమల థియేటర్‌కు వెళ్లి నేను, ఆయన చూశాం. బన్నీ క్యాప్ పెట్టుకుని వచ్చాడు.

సినిమా చూస్తున్నపుడే చాలామంది ఆయన లుక్ గురించి నెగెటివ్ కామెంట్లు చేయడం గమనించారు. ముఖ్యంగా లేడీ గెటప్ విషయంలో చాలా కామెంట్లు వచ్చాయి. థియేటర్ నుంచి బయటికి వచ్చాక ఆయన డల్లుగా కనిపించారు. సినిమా హిట్ అని చెబితే.. అది తనకూ తెలుసన్నాడు. సినిమా బాగుంది కానీ, నేను బాలేను అన్నారు. ఇంటికి వచ్చాక ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తుంటే.. ‘నేను ఏదో ఒక రోజు ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ అవుతా’ అన్నారు.

నేను ఈయన మరీ మనసుకు తీసుకుంటున్నాడు అనుకున్నా. ఆ మాట నాక్కూడా అతిగా అనిపించింది. కానీ ‘పుష్ప-2’ రిలీజైనపుడు థియేటర్‌కు వెళ్తే.. లేడీ గెటప్‌తో బన్నీ గారు కనిపించినపుడు థియేటర్ దద్దరిల్లిపోయింది. నేను ఆ సమయంలో లేచి నిలబడి క్లాప్స్ కొట్టాను. నా చుట్టూ ఉన్న వాళ్లకు అర్థం కాలేదు. ఆ రోజు లేడీ గెటప్ వేస్తే విమర్శించిన ఆడియన్స్.. ఈ రోజు అదే గెటప్ వేస్తే విజిల్స్ కొడుతున్నారు. ‘గంగోత్రి’ టైంలో జరిగింది గుర్తు చేసుకుని ఆ రోజు అలా చేశాను. ఆ రోజు బన్నీ గారు ఎక్కడ నిలబడి ఆ మాట అన్నారో నాకు ఇప్పటికీ గుర్తుంది’’ అని బన్నీ వాసు చెప్పారు.

This post was last modified on January 5, 2026 2:35 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Allu Arjun

Recent Posts

పెద్ద సంకటంలో పడ్డ జన నాయకుడు

భయపడినంతా అయ్యింది. రాజకీయాల్లోకి వెళ్లేముందు చివరి సినిమాగా విజయ్ ప్రకటించుకున్న జన నాయకుడుకి ఇంకా అడ్డంకులు తొలగలేదు. సెన్సార్ సర్టిఫికెట్…

42 minutes ago

ఇల్లాలు ప్రియురాలు మధ్య ‘మహాశయుడి’ వినోదం

సంక్రాంతి పోటీలో అండర్ డాగ్ ఫీలింగ్ కలిగిస్తున్న సినిమాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి మీద మెల్లగా అంచనాలు పెరిగేలా ప్రమోషనల్…

56 minutes ago

క‌ల‌లో కూడా ఊహించ‌ని కాంగ్రెస్‌ – బీజేపీ పొత్తు

ఔను.. మీరు చ‌దివింది నిజ‌మే. నిత్యం ఉప్పు-నిప్పుగా ఉండే.. రెండు రాజ‌కీయాలు.. ఒక‌రిపై ఒక‌రు దుమ్మె త్తిపోసుకునే రాజకీయ పార్టీలు..…

2 hours ago

సంక్రాంతికి శ్రీలీల ఛాయిస్… తన సినిమా కాదు

ఒకే వీకెండ్లో తన సినిమాకు పోటీగా వేరే సినిమా వస్తుంటే.. ఒక చిత్ర బృందంలోని ఏ వ్యక్తి అయినా తమ…

2 hours ago

కేటీఆర్ పర్యటనలో ‘జై జగన్.. జై కేసీఆర్’

వైసీపీ శ్రేణులు బీఆర్ఎస్ విజయం కోసం, బీఆర్ఎస్ కార్యకర్తలు వైసీపీ గెలుపు కోసం కోరుకుంటున్నారని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వైసీపీ…

2 hours ago

ఐబొమ్మ ర‌వికి మ‌రిన్ని క‌ష్టాలు!

సినిమా పైర‌సీల ద్వారా గుర్తింపు పొందిన ఐబొమ్మ ర‌వికి మ‌రిన్ని క‌ష్టాలు వెంటాడుతున్నాయి. ప్ర‌స్తుతం ఐదు కేసుల్లో ర‌వి నిందితుడిగా…

3 hours ago