Movie News

సంక్రాంతి సెన్సార్ – అన్నీ ఫ్యామిలీ సినిమాలే

గత కొన్నేళ్లుగా స్టార్లు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలు సెన్సార్ విషయంలో రాజీ పడకుండా A సర్టిఫికెట్ తీసుకోవడానికి వెనుకాడని వైనం చూస్తున్నాం. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్, కూలీ, యానిమల్, దురంధర్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్లు వందల వేల కోట్లు వసూలు చేసినా ఈ విషయంలో మాత్రం వెనక్కు తగ్గలేదు.

అయితే దీని వల్ల ఒక సమస్య ఉంది. చాలా మల్టీప్లెక్సుల్లో A ఉందనే కారణంగా పద్దెనిమిదేళ్ల లోపు పిల్లలను థియేటర్లోకి అనుమతించడం లేదు. కానీ ఈసారి సంక్రాంతికి ఎలాంటి సమస్య ఉండబోవడం లేదు. ఎందుకంటే అన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు. యు లేదా యు/ఏ ఏదో ఒకటి తెచ్చుకుంటాయి.

రాజా సాబ్ విషయానికి వస్తే హారర్ ఎలిమెంట్స్ వల్ల యు/ఏ వచ్చేయడంతో పిల్లా పెద్దా అందరూ థియేటర్లకే క్యూ కడతారు. మన శంకరవరప్రసాద్ గారుకి అధిక శాతం క్లీన్ యు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇవాళ ఈ లాంఛనం జరిగిపోతుంది.

భర్త మహాశయులకు విజ్ఞప్తిలో రొమాన్స్ ఉన్న కారణంగా ఓన్లీ యు రాకపోవచ్చు కానీ యు/ఏ అయితే పక్కా. అనగనగా ఒక రాజులో వినోదానిదే డామినేషన్ కాబట్టి సెన్సార్ ఏమిస్తుందో సులభంగా గెస్ చేయొచ్చు. నారి నారి నడుమ మురారి కూడా ఫ్యామిలీ క్యాటగిరీనే. జన నాయకుడు డబ్బింగ్ క్యాటగిరీ అందులోనూ భగవంత్ కేసరి రీమేక్ కనక పరిగణనలోకి తీసుకోవడం లేదు.

డిసెంబర్ కొంచెం డ్రైగా గడిచిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఇండస్ట్రీ ఆశలన్నీ సంక్రాంతి పండగ మీదే ఉన్నాయి. టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోలు, థియేటర్ల పంపకాలు ఇవన్నీ వీలైనంత త్వరగా కొలిక్కి రావాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఈసారి పండగ బరిలో వందల కోట్లతో రూపొందిన మూవీ రాజా సాబ్ ఒకటే. ప్రొడక్షన్ పరంగా మిగిలినవన్నీ డీసెంట్ బడ్జెట్ లోనే పూర్తి చేసుకున్నవి. కీలకమైన సీజన్ కాబట్టి యావరేజ్ టాక్ వచ్చినా చాలు నిర్మాతలు గట్టెక్కిపోతారు. జనవరి 10 నుంచి స్కూల్స్, కాలేజీల సెలవులు మొదలుకాబోతున్న నేపథ్యంలో థియేటర్ యాజమాన్యాలు జనాల సందడి కోసం రెడీ అవుతున్నాయి.

This post was last modified on January 5, 2026 2:08 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

2 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

3 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

3 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

6 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

8 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

8 hours ago