త్రివిక్రమ్ శ్రీనివాస్ గొప్ప రచయిత, దర్శకుడు అనే సంగతి అందరికీ తెలుసు. కానీ ఆయన సతీమణి సాయి సౌజన్య ప్రతిభ గురించి తెలిసిన వాళ్లు తక్కువ మందే. దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మేనకోడలైన సాయి సౌజన్య క్లాసికల్ డ్యాన్సర్. లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే సాయి సాజన్య.. అప్పుడప్పుడూ తన భరతనాట్యం ప్రతిభను వేదికల మీద ప్రదర్శిస్తుంటారు. గతంలో ఆమె ప్రదర్శనకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి.
తాజాగా ఆమె మరోసారి భరత నాట్యం ప్రదర్శన ఇచ్చింది. అది చూస్తే తన అసాధారణ ప్రతిభ గురించి తెలుస్తుంది. అద్భుతమైన నృత్యం.. చక్కటి హావభావాలతో ఆకట్టుకున్నారు సాయి సౌజన్య. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సాయిసౌజన్యకు ఎదిగిన కొడుకు ఉన్నాడు. ఈ వయసులోనూ ఆమె అద్భుతంగా నృత్యం చేస్తుండడం విశేషం.
సాయి సౌజన్య ప్రస్తుతం సినీ పరిశ్రమలో నిర్మాతగానూ కొనసాగుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ నిర్మించే చిత్రాల్లో ఆమె భాగస్వామిగా కొనసాగుతున్నారు. త్రివిక్రమ్ చాలా ఏళ్ల నుంచి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలోనే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
అది ఆయన హోం బేనర్‌గా మారిపోయింది. మరోవైపు సితార సంస్థ.. సాయి సౌజన్య ఆధ్వర్యంలోని ఫార్చ్యూన్ ఫోర్‌తో కలిసి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తోంది. హారిక అండ్ హాసినిలో కేవలం త్రివిక్రమ్ సినిమాలే నిర్మితం అవుతాయి. సితారలో చేసే సినిమాలన్నింటినీ త్రివిక్రమ్ పర్యవేక్షిస్తుంటారు.
This post was last modified on January 5, 2026 12:22 pm
రాజమౌళి కంటే ముందు సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుతమైన కథలు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…
హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చర్చల్లో ఉన్న చిత్రం. సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. రుద్రమదేవి తర్వాత తీయాలనుకున్న సినిమా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…
విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్కు న్యూజిలాండ్ షాక్…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…