పూనమ్ కౌర్ పంజాబీ అమ్మాయే అయినా.. తెలుగులోనే సినిమాలు చేసింది. సినిమా అవకాశాలు తగ్గాక కూడా ఆమె ఇక్కడే ఉంటోంది. ఒక యాక్టర్ కమ్ పొలిటీషియన్‌తో లింక్ చేసి.. తరచుగా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పూనమ్ పేరును ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తుంటారన్న సంగతి తెలిసిందే.
ఐతే అంతటితో ఆగకుండా పూనమ్‌ను ఒక పార్టీ వ్యక్తులు ఎంతగా బెదిరించారో.. ఆమెను తమ దారిలోకి తెచ్చుకోవడానికి ఏమేం చేశారో ఇప్పుడు వెల్లడైంది. ఒక ఇంటర్వ్యూలో పూనమ్ కౌర్ కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది.
ఒక సందర్భంలో కడప నుంచి వచ్చిన కొందరు తనను బెదిరించిన విషయాన్ని ఆమె బయటపెట్టింది. ఒక నటుడికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలని వాళ్లు డిమాండ్ చేసినట్లు ఆమె వెల్లడించింది. ముందు డబ్బులు ఇవ్వజూపారని.. తర్వాత పదవి ఆశపెట్టారని.. వీటికి తాను లొంగకపోతే నీ న్యూడ్ వీడియాలు బయటపెడతాం అంటూ బెదిరించినట్లు ఆమె చెప్పింది. ఈ విషయం తన కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ తెలియదని.. తాను ఎవ్వరికీ చెప్పకుండా తనలోనే దాచుకున్నానని ఆమె చెప్పింది.
మరోవైపు వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి వల్ల తాను వ్యక్తిగత జీవితంలో ఎంత నష్టపోయానో ఆమె వెల్లడించింది. ఒక సందర్భంలో పోసాని ప్రెస్ మీట్ పెట్టి తన గురించి దారుణంగా మాట్లాడాడని.. దాని వల్ల తాను జీవితంలో పెళ్లి చేసుకోలేని పరిస్థితి తలెత్తిందని ఆమె చెప్పింది. అప్పటికి పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉండగా.. ఆ ప్రెస్ మీట్ తర్వాత ఆ విషయం పక్కనపెట్టేశానంది. పోసాని ప్రెస్ మీట్ వల్ల వ్యక్తిగత జీవితంలో చాలా కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
This post was last modified on January 5, 2026 12:12 pm
స్థానిక సంస్థల ఎన్నికలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు సంవత్సరాల పాలనకు ఈ ఎన్నికలను రిఫరెండంగా భావిస్తున్న రేవంత్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం…
ఏషియన్ సినిమా సంస్థ.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోల…
తిరువీర్.. ఈ పేరు చూసి ఇప్పటికీ ఎవరో పరభాషా నటుడు అనుకుంటూ ఉంటారు కానీ.. అతను అచ్చమైన తెలుగు కుర్రాడు. చేసినవి తక్కువ…
ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండు సార్లు నోటీసులు అందుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ దఫా కూడా.. సిట్…
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…