Movie News

ప్రేమమ్ హీరో కమ్ బ్యాక్ అదిరింది

నివిన్ పౌలీ.. ఒక‌ప్పుడు సౌత్ ఇండియా అంత‌టా మార్మోగిన పేరు. ఈ మ‌లయాళ హీరో ప్ర‌ధాన పాత్ర పోషించిన ప్రేమమ్ సినిమా అప్ప‌ట్లో రేపిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఇండియ‌న్ ఫిలిం హిస్ట‌రీలోనే బెస్ట్ ల‌వ్ స్టోరీస్‌లో ఒక‌టిగా నిలిచిన ఈ చిత్రం క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది.

ఇత‌ర భాష‌ల వాళ్లు కూడా ఎగ‌బ‌డి చూశారీ చిత్రాన్ని. దీని కంటే ముందు బెంగ‌ళూరు డేస్, నేర‌మ్ స‌హా ప‌లు చిత్రాల‌తో నివిన్ మెప్పించాడు. ప్రేమమ్ త‌ర్వాత కూడా కొన్ని హిట్లు ప‌డ్డాయి. ఒక ద‌శ‌లో మ‌ల‌యాళ టాప్ స్టార్ల‌లో ఒక‌డిగా వెలుగొందాడు నివిన్. 

కానీ ఆ స్థానాన్ని నిల‌బెట్టుకునే సినిమాలు ఆ త‌ర్వాత చేయ‌క‌పోవ‌డంతో త‌న స్టార్‌డ‌మ్ క‌రుగుతూ వ‌చ్చింది. 2019లో ల‌వ్ యాక్ష‌న్ డ్రామా అనే సినిమాతో స‌క్సెస్ అందుకున్నాక‌ నివిన్‌కు నిఖార్స‌యిన హిట్ అన్న‌దే లేక‌పోయింది. దీంతో నివిన్ మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. నెమ్మ‌దిగా త‌న‌ను ప్రేక్ష‌కులు పట్టించుకోవ‌డం మానేసే ప‌రిస్థితి వ‌చ్చింది.

ఇలాంటి టైంలో గ‌త ఏడాది చివ‌ర్లో, క్రిస్మ‌స్ వీకెండ్లో స‌ర్వం మాయం అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు నివిన్. పెద్ద‌గా అంచ‌నాలు లేకుండా రిలీజైన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను స‌ర్ప్రైజ్ చేసింది. అఖిల్ స‌త్య‌న్ అనే కొత్త ద‌ర్శ‌కుడు రూపొందించిన ఈ చిత్రం యువ‌త‌తో పాటు ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ను అమితంగా ఆక‌ట్టుకుంటోంది.

విదేశాల‌కు వెళ్లి స్థిర‌ప‌డాల‌నుకునే ఓ కుర్రాడు అనుకోని ప‌రిస్థితుల్లో ఒక పూజారిగా మారి.. ఓ అమ్మాయి ప్రేమ‌లో ప‌డే క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కింది. ఆద్యంతం ఆహ్లాద‌భ‌రితంగా, వినోదాత్మ‌కంగా సాగే సినిమాలో నివిన్ పౌలీ చ‌క్క‌టి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. 

అత‌డికి మించి క‌థానాయిక పాత్ర పోషించిన‌ రియా షిబు అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. సినిమాకు ఆమెనే హైలైట్ అంటున్నారు. క్రేజీగా సాగే త‌న పాత్ర‌కు యూత్ బాగా క‌నెక్ట్ అవుతున్నారు. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ కావ‌డం.. బోర్ కొట్ట‌కుండా సినిమా సాగిపోవ‌డంతో స‌ర్వంమాయ‌కు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి ఫ‌లితం ద‌క్కింది.

ఇప్ప‌టికే ఈ సినిమా రూ.100 కోట్ల క‌లెక్ష‌న్ల మార్కును దాటేసింది. ఒక హిట్ ప‌డితే చాలు అనుకుంటున్న టైంలో ఏకంగా కెరీర్ హైయెస్ట్ గ్రాస‌ర్ రావ‌డంతో నివిన్, త‌న అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవు.

This post was last modified on January 5, 2026 7:41 am

Share

Recent Posts

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

1 hour ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

2 hours ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

6 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

6 hours ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

8 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

9 hours ago