సంక్రాంతి రేసులో రాజా సాబ్ తర్వాత ఎక్కువ అంచనాలు మోస్తున్న సినిమాగా మన శంకరవరప్రసాద్ గారు మీద మెగా ఫ్యాన్స్ ఆశలు ఏ స్థాయిలో ఉన్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఎంటర్ టైన్మెంట్ హ్యాండిల్ చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి తోడవ్వడంతో ఫన్ ఏ రేంజ్ లో ఉంటుందోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
తిరుపతిలో ఘనంగా జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ జరిగిపోయింది. చెప్పిన టైంకి ఎలాంటి ఆలస్యం లేకుండా కంటెంట్ వదిలేశారు. పూర్తిగా కాదు కానీ చూచాయగా కథేంటో చెబుతూ, చెప్పీ చెప్పకుండా రివీల్ చేశారు. కొన్ని క్లూస్ మాత్రమే ఇచ్చారు.
ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసే ఆఫీసర్ వరప్రసాద్ (చిరంజీవి) మాములు జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న శశిరేఖ (నయనతార) కు దూరంగా ఎందుకు బ్రతికాల్సి వచ్చిందో అంతు చిక్కని రహస్యంగా మారుతుంది. ఈలోగా ప్రభుత్వానికి వరప్రసాద్ తో పని పడుతుంది.
దీంతో మనోడు రంగంలోకి దిగుతాడు. అదే సమయంలో తన ఫ్రెండ్ (వెంకటేష్) కూడా ఎంట్రీ ఇస్తాడు. అసలు గవర్నమెంట్ మిషన్ ఏంటి, ఉద్యోగం, కుటుంబాన్ని వదిలేసి వరప్రసాద్ ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది, అతని జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన శత్రువులు ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి.
ట్రైలర్ కట్ కొంచెం హడావిడిగా అనిపించినా దర్శకుడు అనిల్ రావిపూడి తనేం చూపించబోతున్నాడో ఒక ఐడియా అయితే ఇచ్చారు. చిరంజీవి మాస్ లుక్స్ తో పాటు కొంచెం కామెడీ యాంగిల్ ని శాంపిల్ గా చూపించి, చిరు వెంకీల కలయికని ఒక డైలాగుతో బయట పెట్టేశారు.
అయితే ఫ్యాన్స్ లో ఉన్న భారీ అంచనాలకు అనుగుణంగా ట్రైలర్ ఉందా అంటే వెంటనే ఎస్ చెప్పలేని పరిస్థితి. ఇంకొంచెం బెటర్ కట్ ఉండాల్సిందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. జనవరి 9 రిలీజ్ కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు ఇంకో ఎనిమిది రోజుల్లో ప్రేక్షకులకు వినోదాల విందు వడ్డించబోతున్నారు.
This post was last modified on January 4, 2026 6:08 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…