ఇండియన్ సినిమాలో ఒక కథను రెండు భాగాలుగా తీయడం, సీక్వెల్స్ చేయడం అనే ట్రెండు బాగా ఊపందుకోవడంలో ‘బాహుబలి’ సినిమా పాత్ర కీలకం. ముఖ్యంగా ఈ మధ్య ప్రభాస్ సినిమా అంటే చాలు.. రెండో భాగం తెరపైకి వచ్చేస్తోంది. సలార్, కల్కి చిత్రాలకు సీక్వెల్స్ లైన్లో ఉండగా.. ‘ఫౌజీ’కి సైతం సీక్వెల్ ఉంటుందని వెల్లడైంది. మరి రెబల్ స్టార్ కొత్త చిత్రం ‘రాజాసాబ్’కు పార్ట్-2 ఉంటుందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు.
దీని గురించి దర్శకుడు మారుతి తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ట్రైలర్లో చూసిన ‘జోకర్’ షాట్.. పార్ట్-2కు లీడ్ ఇవ్వడం కోసమే పెట్టినట్లు అతను వెల్లడించాడు. ఐతే పార్ట్-2కు ఇంకా స్క్రిప్టు ఏమీ రెడీ కాలేదని కూడా అతను క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతానికి లీడ్ ఇస్తామని.. తర్వాత అన్నీ అనుకూలించడాన్ని బట్టి పార్ట్-2 ఉంటుందని అతను తెలిపాడు.
రాజాసాబ్-2 కోసం ఇప్పుడున్న కథను సాగదీయడం లాంటిదేమీ చేయనని మారుతి స్పష్టం చేశాడు. పార్ట్-2 విషయంలో ఏం చేయాలి అనే విషయంలో తనకు, ప్రభాస్‌కు ఫుల్ క్లారిటీ ఉందని.. కథను సాగదీస్తారేమో అని ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నాడు మారుతి. ఇంతకుముందు ఓ సందర్భంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. సీక్వెల్ గురించి క్లారిటీగా చెప్పకుండా ‘రాజాసాబ్’ ప్రపంచం కొనసాగుతుందని మాత్రం వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం మారుతి మాటల్ని బట్టి చూస్తుంటే.. పార్ట్-2కు లీడ్ ఇచ్చి, ఈ సినిమాకు వచ్చే ఫలితాన్ని బట్టి, ప్రభాస్ వీలును బట్టి కొత్తగా ఇంకో కథ రాసి దాన్ని రాజాసాబ్-2గా తీసుకొస్తారని అర్థమవుతోంది. మరి ఈ నెల 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘రాజాసాబ్’కు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.
This post was last modified on January 4, 2026 1:29 pm
సంక్రాంతి రేసులో రాజా సాబ్ తర్వాత ఎక్కువ అంచనాలు మోస్తున్న సినిమాగా మన శంకరవరప్రసాద్ గారు మీద మెగా ఫ్యాన్స్…
సూపర్ స్టార్ రజినీకాంత్‌ను సైతం వెనక్కి నెట్టి తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరో పోటీలో కొనసాగుతున్నాడు విజయ్. ఇలాంటి…
బీఆర్ఎస్ మాజీ మంత్రి, సీనియర్ నేత.. హరీష్‌రావుపై ఆ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.…
విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ…
జననాయగన్.. జననాయగన్.. ఇప్పుడు తమిళ సినీ జనాలందరి నోళ్లలోనూ ఇదే మాట నానుతోంది. అక్కడ నంబర్ వన్ స్థానంలో ఉన్న…
ఈ రోజుల్లో చిన్న సినిమాల కోసం ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం పెద్ద టాస్కుగా మారిపోయింది. సినిమా బాగుంటే.. నెమ్మదిగా జనాలు…