ఈ రోజుల్లో చిన్న సినిమాల కోసం ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం పెద్ద టాస్కుగా మారిపోయింది. సినిమా బాగుంటే.. నెమ్మదిగా జనాలు థియేటర్లకు వస్తారు.. సినిమాకు లాంగ్ రన్ ఉంటుంది అనుకునే రోజులు కావు. ఏదైనా తొలి వీకెండ్లోనే తేలిపోతోంది. రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించకపోతే.. మంచి సినిమా అయినా బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపకుండానే వెళ్లిపోతుంది.
‘ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో’ లాంటి మంచి సినిమాలు ఇలాగే ఫెయిల్ అయ్యాయి. సరైన పబ్లిసిటీ లేకపోవడం వల్ల ఆ పేరుతో ఒక సినిమా వస్తున్న సంగతే జనాలకు తెలియలేదు. టాక్, రివ్యూలు బాగున్నా సరే.. అది జనాల దృష్టిలో పడలేదు. దాని గురించి తెలుసుకునే లోపే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో సినిమా మేకింగ్ దశలో ఉండగానే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేలా ప్రమోషన్లు చేయడం.. ఇంట్రెస్టింగ్ ప్రోమోలు కట్ చేయడం ఎంతో కీలకం.
మత్తు వదలరా, హ్యాపీ బర్త్ డే, మత్తు వదలరా-2 చిత్రాల దర్శకుడు రితేష్ రాణా.. కమెడియన్ సత్యను లీడ్ రోల్‌లో పెట్టి తీస్తున్న ‘జెట్లీ’ సినిమాను ప్రమోట్ చేస్తున్న తీరు.. చిన్న సినిమాలకు ఒక పాఠం అని చెప్పొచ్చు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ దగ్గర్నుంచి ప్రేక్షకులను అలరిస్తోంది. సత్య ‘‘ఐయామ్ డన్ విత్ కామెడీ’’ అంటున్నట్లు ట్యాగ్ లైన్ పెట్టి మరీ దీని ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఆ తర్వాత హీరోయిన్ని పరిచయం చేసేటపుడు, వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్ లాంచ్ టైంలో.. ఇలా ప్రతి సందర్భంలోనూ ఫన్నీ వీడియోలతో ఆకట్టుకుంది టీం.
సత్య తన మీద తాను, టీం అతడి మీద వేసిన పంచులు ఈ వీడియోల్లో హైలైట్. తాజాగా ‘జెట్లీ’ ట్రైలర్ లాంచ్ చేశారు. అది పూర్తి వినోదాత్మకంగా సాగింది. అంతకుమించిన వినోదాన్ని టీజర్ లాంచ్ ఈవెంట్లో టీం అందించింది. దర్శకుడు రితేష్ రాణా మాట్లాడుతున్నపుడు.. తన జేబులోంచి స్పీచ్ పేపర్ తీసి సత్య ఇవ్వగా.. ఆ పేపర్లో ఉన్న ప్రసంగం విలేకరులతో పాటు ఈవెంట్‌కు హాజరైన వాళ్లందరి కడుపు చెక్కలయ్యేలా చేసింది.
ఆ స్పీచ్‌లో ఉన్న ఫన్ ఒకెత్తయితే.. దీన్ని స్టేజ్ మీద ప్రెజెంట్ చేసిన తీరు.. సత్య, రితేష్‌ల హావభావాలు ఇంకో ఎత్తు. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో వైరల్ అయింది. ఇలాంటి వెరైటీ, ఫన్నీ ప్రమోషన్లతోనే సినిమా మీద ప్రేక్షకుల్లో ఎంతో క్యూరియాసిటీని పెంచింది ‘జెట్లీ’ టీం. సినిమా కూడా బాగుంటే.. ‘మత్తు వదలరా’, ‘మత్తువదలరా-2’ లాగే ఇది పెద్ద హిట్టయ్యే అవకాశముంది.
This post was last modified on January 4, 2026 1:24 pm
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విషమ పరీక్షగా మారారా? ట్రంప్ దూకుడు కారణంగా…
గత కొన్నేళ్లుగా స్టార్లు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలు సెన్సార్ విషయంలో రాజీ పడకుండా A సర్టిఫికెట్ తీసుకోవడానికి వెనుకాడని…
తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీపై కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ తీరు, నాయకత్వ వైఖరిపై ఆవేదన వ్యక్తం…
యువతలో పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినీ హీరోగా అభిమానాన్ని సంపాదించుకున్న పవన్, అదే స్థాయిలో…
నిన్న విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు ట్రైలర్ అభిమానుల వరకు బాగుందనిపించింది కానీ సాధారణ ప్రేక్షకులు మాత్రం ఏదో కొంత…
పూనమ్ కౌర్ పంజాబీ అమ్మాయే అయినా.. తెలుగులోనే సినిమాలు చేసింది. సినిమా అవకాశాలు తగ్గాక కూడా ఆమె ఇక్కడే ఉంటోంది.…