Movie News

హైద‌రాబాద్‌కు మొదటి డాల్బీ స్క్రీన్ రెడీ

ఓవైపు థియేట‌ర్ల‌కు వ‌చ్చే జ‌నం సంఖ్య త‌గ్గిపోతోంద‌నే ఆందొళ‌న వ్య‌క్త‌మ‌వుతూనే ఉంది. అదే స‌మ‌యంలో ఇంకో వైపు థియేట‌ర్ల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. దేశ‌వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ల మ‌నుగ‌డ ప్ర‌మాదంలో ప‌డ్డ‌ప్ప‌టికీ.. అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లోనూ కొత్త‌ మ‌ల్టీప్లెక్సులు వ‌స్తూనే ఉన్నాయి. దేశంలో సినిమా అభిమానం అత్య‌ధికంగా ఉండే న‌గ‌రాల్లో ఒక‌టైన హైదరాబాద్‌లో ప‌దుల సంఖ్య‌లో కొత్త స్క్రీన్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

గ‌త ఏడాది వ‌న‌స్థ‌లిపురంలో ఏషియ‌న్ మూవీస్, ర‌వితేజ క‌ల‌యిక‌లో ఆరు స్క్రీన్ల‌ ఏఆర్‌టీ మ‌ల్టీప్లెక్స్‌ను మొద‌లుపెట్టగా దానికి మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇంకా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఏఎంబీ, ఐనాక్స్ మ‌ల్టీప్లెక్సులు రెడీ అవుతున్నాయి. ఎల్బీన‌గ‌ర్‌, హ‌స్తినాపురం, క‌ర్మాన్‌ఘాట్‌లోనూ మ‌ల్టీప్లెక్సులు నిర్మాణంలో ఉన్నాయి. ఈలోపే ఒక ప్ర‌తిష్టాత్మ‌క మ‌ల్టీప్లెక్స్ సిటీలో ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంది. శ‌నివారం కోకాపేట‌లో అల్లు సినిమాస్‌ను లాంచ్ చేసినట్టు తెలుస్తోంది. సంక్రాంతి నుండే ప్రారంభం కూడా కానుందట.

వ‌న‌స్థ‌లిపురంలోని ఏఆర్‌టీలో ఎపిక్ స్క్రీన్ ఎంత అప్లాజ్ తెచ్చుకుందో హైద‌రాబాద్ సినీ ప్రియుల‌కు తెలుసు. క్రేజున్న సినిమాకు అందులో బుకింగ్స్ మొద‌లుపెడితే చాలు.. కాసేప‌టికే టికెట్లు అయిపోతున్నాయి. మంచి ఆక్యుపెన్సీల‌తో న‌డుస్తోంది ఆ స్క్రీన్. ఇప్పుడు అల్లు సినిమాస్ పేరు మ‌రింత‌గా మార్మోగ‌డం ఖాయం. ఎందుకంటే అందులో ఒక స్పెష‌ల్ స్క్రీన్ ఉంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ దాల్బీ స్క్రీన్ ఇందులో నిర్మాణం జ‌రుపుకుంది.

75 అడుగుల దాల్బీ స్క్రీన్‌లో సినిమా చూడడం అద్భుత‌మైన అనుభూతిని ఇస్తుంద‌ని సినీ పండితులు చెబుతున్నారు. హైద‌రాబాద్ సిటీకి ప్ర‌సాద్స్ మ‌ల్టీప్లెక్స్‌లోని పీసీఎక్స్ ఎలా మ‌ణిహారంలా మారిందో.. అల్లు సినిమాస్‌లోని దాల్బీ స్క్రీన్ కూడా అంతే ఆక‌ర్ష‌ణ కాబోతోంద‌ని అంటున్నారు. విజువ‌ల్‌గా గొప్ప‌గా ఉండే ఈవెంట్ ఫిలిమ్స్‌ను ఈ స్క్రీన్లో చూస్తే ఆ అనుభూతే వేరుగా ఉంటుంద‌ట‌. సంక్రాంతి సినిమాల‌తోనే అల్లు సినిమాస్‌లో స్క్రీనింగ్ మొద‌లు కానుంది. ఈ నెల 9న రిలీజ‌య్యే రాజాసాబ్ ఇందులో ప్ర‌ద‌ర్శిత‌మ‌య్యే తొలి సినిమా కానుంది.

This post was last modified on January 3, 2026 8:32 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Allu cinemas

Recent Posts

గ్రౌండ్ లెవెల్ పై రేవంత్ రెడ్డి దృష్టి

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. రెండు సంవ‌త్స‌రాల పాల‌న‌కు ఈ ఎన్నిక‌ల‌ను రిఫ‌రెండంగా భావిస్తున్న రేవంత్…

2 hours ago

బాబు గారి మూడు కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం…

2 hours ago

ఏఎంబీ… ఇక్కడ హిట్… అక్కడ ఫ్లాప్?

ఏషియన్ సినిమా సంస్థ.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోల…

3 hours ago

ప్రమోషన్లలో మోసపోతున్న యంగ్ హీరో

తిరువీర్.. ఈ పేరు చూసి ఇప్పటికీ ఎవరో పరభాషా నటుడు అనుకుంటూ ఉంటారు కానీ.. అతను అచ్చమైన తెలుగు కుర్రాడు. చేసినవి తక్కువ…

3 hours ago

`సిట్` విచారణపై వ్యూహం రచిస్తున్న కేసీఆర్?

ఫోన్ ట్యాపింగ్ కేసులో  రెండు సార్లు నోటీసులు అందుకున్న తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఈ ద‌ఫా కూడా.. సిట్…

4 hours ago

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

4 hours ago