కమల్ హాసన్ నిర్మాతగా రజనీకాంత్ హీరోగా రూపొందబోయే సినిమా తాలూకు దర్శకుడి సస్పెన్స్ వీగిపోయింది. శివ కార్తికేయన్ డాన్ డీల్ చేసిన శిబి చక్రవర్తిని అఫీషియల్ గా లాక్ చేస్తూ ఇవాళ ప్రకటన ఇచ్చారు. దీనికన్నా ముందు రెండుమూడు పేర్లు వినిపించాయి కానీ ఫైనల్ గా శిబిని ఫిక్స్ చేయడం అనూహ్యం.
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే దసరా టైంలో న్యాచురల్ స్టార్ నానికి ఇదే శిబి ఒక కథ వినిపించి కొంత కాలం దాని మీద హైదరాబాద్ లో వర్క్ చేశారు. కానీ ఏవో కారణాల వల్ల అది క్యాన్సిల్ కావడం, అతను చెన్నైకి తిరిగి వెళ్లిపోవడం జరిగాయని ఫిలిం నగర్ టాక్. ఇప్పుడు రజనికి చెప్పింది అదే కథనా కాదానేది సస్పెన్స్.
ఇప్పుడీ ప్యాన్ ఇండియా మూవీలో రజనీకాంత్ టైలర్ గా కనిపించబోతున్నట్టు సమాచారం. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఒక సూట్ చుట్టూ కత్తెర్లు బెట్టి ఒక మూలాన బటన్లు ఉంచి, బులెట్లను కనిపించి కనిపించినట్టు హైడ్ చేయడం చూస్తే ఏదో డిఫరెంట్ గానే అనిపిస్తోంది.
కుర్ర దర్శకులతో పని చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్న రజనీకాంత్ కాలా నుంచి కూలి దాకా ఇదే ఫాలో అయ్యారు. ముందు సుందర్ సిని అనుకున్నా ఆయన స్క్రిప్ట్ నచ్చకపోవడంతో ఏకాభిప్రాయం రాలేదని, దాని వల్లే ఆయన హఠాత్తుగా బయటికి వచ్చారనే ప్రచారం చెన్నై వర్గాల్లో జోరుగా జరిగింది. ఒకరకంగా ఇదీ మంచికేనని అభిమానులు ఫీలయ్యారు.
నిజానికి శిబి చక్రవర్తి మరోసారి శివ కార్తికేయన్ తో సినిమా చేయాలని చాలా ట్రై చేసారు. కానీ కుదరలేదు. మదరాసి, పరాశక్తి అంటూ వరుస కమిట్ మెంట్లతో డేట్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొనడంతో పాటు వెంకట్ ప్రభుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా తాను ఇప్పట్లో దొరకనని శివ కార్తికేయన్ సంకేతం ఇచ్చాడు.
తంతే బూరెల బుట్టలో పడ్డట్టు ఇప్పుడు శిబి ఏకంగా సూపర్ స్టార్ నే మెప్పించాడు. ఇది పూర్తయ్యాక వేరే దర్శకుడితో కమల్ హాసన్ – రజనీకాంత్ మల్టీస్టారర్ ఇదే బ్యానర్ లో ఉంటుంది. కాకపోతే కాంబినేషన్ కుదరడానికి కొంచెం ఎక్కువ టైం పట్టేలా ఉంది. అన్నట్టు శిబి మూవీకి టైలర్ టైటిల్ పెడితే బాగుంటుందేమో.
This post was last modified on January 3, 2026 12:39 pm
చిన్నపిల్లాడిగా ఉండగా రుద్రమదేవి.. టీనేజీలో నిర్మలా కాన్వెంట్ సినిమాలు చేసిన శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా.. ఆ తర్వాత పెళ్ళిసందడి…
జన నాయకుడు ట్రైలర్ వచ్చాక అందరి డౌట్లు తీరిపోయాయి. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇది భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం…
తెలంగాణ శాసన సభ శీతాకాల సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో ఇరిగేషన్ ప్రాజెక్టుల…
తెలుగులో కామెడీ బాగా డీల్ చేయగల దర్శకుల్లో మారుతి ఒకడు. అతను తీసిన చిత్రాల్లో చాలా వరకు ఎంటర్టైనర్లే. ‘భలే…
తెలంగాణలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగాయి. దీనిలో అధికార కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. ఇక, దీనికి ముందు.. జూబ్లీహిల్స్…
కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం.. బీజేపీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు…