ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దంన్నర దాటినా ఇంకా స్ట్రగులవుతూనే ఉన్న హీరోల్లో నందు ఒకడు. మధ్యలో సపోర్టింగ్ రోల్స్ చేశాడు కానీ అవీ ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయాయి. సోలోగా అతనితో సినిమాలు తీసే నిర్మాతలు ఉన్నప్పటికీ కనీసం అవి రిలీజయ్యాయని కూడా తెలియనంత వీక్ గా థియేటర్ల నుంచి మాయమైపోతున్నాయి.
అయితే నందుకి ఈసారి కేవలం వారం గ్యాప్ లో మూడు సినిమాలు రిలీజ్ కావడం లక్కీ బ్రేక్ అనుకోవాలి. ఒక దాంట్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్, మరొక మూవీలో మెయిన్ విలన్, ఇంకొక చిత్రంలో హీరో. ఎప్పుడో మోహన్ బాబు లాంటి వాళ్ళకు మాత్రమే ఈ ఫీట్ సాధ్యమయ్యేది. ఆ రకంగా నందుది అదృష్టమే.
కానీ ఇంత కష్టానికి ఫలితం దక్కిందా అనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ఫలితాలను విశ్లేషించుకోవాలి. డిసెంబర్ 25 విడుదలైన దండోరాకు విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. నిజంగా సినిమా బాగానే ఉంది. సీరియస్ కాన్సెప్ట్ ని హత్తుకునేలా తీసిన తీరు వెళ్లిన ఆడియన్స్ ని మెప్పించింది.
నెగటివ్ టాక్ రాలేదు. కానీ కమర్షియల్ ఫుల్ లేకపోవడంతో పాటు శంబాల, ఈషా, ఛాంపియన్ మధ్య నలిగిపోవడంతో ఆపరేషన్ సక్సెస్, రోగి డెడ్ అన్నట్టు అయిపోయింది. ఇక జనవరి 1 నూతన సంవత్సర సందర్భంగా ఒకేసారి రెండు సినిమాలలో కనిపించాడు నందు. వాటిలో సైక్ సిద్దార్థ ముఖ్యమైనది.
సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ప్రమోషన్లు బాగా జరిగాయి. రానా దగ్గరుండి చూసుకోవడమే కాదు తానూ భాగమయ్యాడు. కానీ తీరా రిలీజయ్యాక చూస్తే రివ్యూస్, టాక్ ఏమంత ఆశాజనకంగా లేవు. పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుందనుకుంటే యూత్ కి కూడా పెద్దగా కనెక్ట్ అయిన దాఖలాలు తక్కువ.
ఫైనల్ స్టేటస్ సోమవారానికి తేలుతుంది కానీ ఇప్పటికైతే ప్రతికూలత ఉంది. ఇక వనవీరలో విలన్ గా చేసిన నందుకు దాని వల్ల ప్రయోజనం దక్కేలా లేదు. రిపోర్ట్స్ యావరేజ్ లేదా అంతకు కిందే ఉన్నాయి. మొత్తానికి నందు పడిన ట్రిపుల్ కష్టం వల్ల తాను కోరుకున్న బ్రేక్ ఏ మేరకు ఇచ్చిందో కొత్త సినిమాలు మొదలుపెట్టాక క్లారిటీ వస్తుంది.
This post was last modified on January 2, 2026 5:51 pm
కొందరు పరభాషా కథానాయికలను చూస్తే.. వాళ్లు వేరే భాషకు చెందిన వాళ్లు అనే ఫీలింగే రాదు. చక్కగా తెలుగు నేర్చుకుని,…
దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఒడిశా,…
జన నాయకుడు విడుదల రాజా సాబ్ తో పాటే ఉన్న నేపథ్యంలో ఏపీ తెలంగాణలో విజయ్ సినిమాకు వచ్చే ఓపెనింగ్స్…
రాజమౌళి ప్రతిభ కేవలం సినిమా తీయడం వరకే పరిమితం కాదు. ఆయన బాగా నటించగలరు. అలాగే డ్యాన్సులు కూడా ఇరగదీస్తారు.…
అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ గ్రామానికి ఒక శాపమో, దెయ్యమో ఆవహించి ఉంటుంది. దాన్ని వదిలించాలంటే హీరో రంగంలోకి…
జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఒక క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. ఆటలో ఒక ప్లేయర్ హెల్మెట్…