రాజమౌళి ప్రతిభ కేవలం సినిమా తీయడం వరకే పరిమితం కాదు. ఆయన బాగా నటించగలరు. అలాగే డ్యాన్సులు కూడా ఇరగదీస్తారు. ఆ మధ్య ఒక కుటుంబ వేడుకలో ఆయన వేసిన స్టెప్పులు చూసి అందరూ షాకైపోయారు. కొన్ని రోజుల పాటు ప్రాక్టీస్ చేసి మరీ.. హీరోలకు ఏమాత్రం తీసిపోని రీతిలో డ్యాన్సులేశారు జక్కన్న. తాజాగా ఈ దర్శక ధీరుడు మరోసారి తన డ్యాన్సింగ్ టాలెంట్ చూపించాడు. ఈసారి ఆయనతో జట్టు కట్టింది ప్రియాంక చోప్రా కావడం విశేషం.
జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’లో ప్రియాంక.. మందానికి అనే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా న్యూఇయర్ సందర్భంగా తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్పెషల్ వీడియో చూస్తే అందులో రాజమౌళి, ప్రియాంక కలిసి అదిరిపోయే లెవెల్లో స్టెప్పులేశారు. ఒక ఇంగ్లిష్ పాటకు రాజమౌళి చాలా స్టైలిష్‌గా స్టెప్పులేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డ్యాన్స్ అయ్యాక జక్కన్నను ఆనందంతో కౌగిలించుకుంది ప్రియాంక. ‘వారణాసి’ సినిమాలో నటించడాన్ని.. ఈ చిత్ర బృందంతో కంపెనీని ప్రియాంక ఎంతో ఎంజాయ్ చేస్తోందని.. తన సోషల్ మీడియా పోస్టులు అవీ చూస్తేనే అర్థమవుతోంది. ‘వారణాసి’ టైటిల్ లాంచ్ ఈవెంట్లోనూ ఆమె చాలా హుషారుగా కనిపించింది.
ఒకప్పుడు బాలీవుడ్‌కే పరిమితం అయిన ప్రియాంక.. తర్వాత హాలీవుడ్‌కు వెళ్లి అక్కడ మంచి పేరే సంపాదించింది. ‘వారణాసి’పై గ్లోబల్ ప్రేక్షకుల దృష్టి పడడంలో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తోంది. సినిమాలో ఆమె రోల్ పవర్ ఫుల్‌గా ఉండబోతోందని తన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. ట్రెడిషనల్ ఇండియన్ శారీ లుక్‌లో గన్ను పట్టుకుని ఫెరోషియస్‌గా కనిపించింది ప్రియాంక.
This post was last modified on January 2, 2026 3:02 pm
జన నాయకుడు విడుదల రాజా సాబ్ తో పాటే ఉన్న నేపథ్యంలో ఏపీ తెలంగాణలో విజయ్ సినిమాకు వచ్చే ఓపెనింగ్స్…
అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ గ్రామానికి ఒక శాపమో, దెయ్యమో ఆవహించి ఉంటుంది. దాన్ని వదిలించాలంటే హీరో రంగంలోకి…
జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఒక క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. ఆటలో ఒక ప్లేయర్ హెల్మెట్…
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూసీ నదీ ప్రక్షాళనపై సభలో చర్చ జరిగింది. ఈ…
ఏపీకి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రానున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వ…
దర్శకుడు పూరి జగన్నాథ్ కంబ్యాక్ మూవీగా షూటింగ్ మొదలైనప్పటి నుంచే పాజిటివ్ వైబ్స్ మోస్తున్న స్లమ్ డాగ్ ( ప్రచారంలో…