ఎల్లుండి తిరుపతిలో మన శంకరవరప్రసాద్ గారు ట్రైలర్ లాంచ్ జరగబోతోంది. ఇప్పటిదాకా ఒక లెక్క ఇకనుంచి ఒక లెక్క అనేలా ఫైనల్ కట్ ఉంటుందని మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ రోజు వరకు మూడు పాటలు మినహాయించి ఈ సినిమా నుంచి ఎలాంటి వీడియో కంటెంట్ రాలేదు.
అంటే సన్నివేశాలు, డైలాగులు, ఫైట్లు లాంటివి ఏవీ రివీల్ చేయకుండా దర్శకుడు అనిల్ రావిపూడి ఇక్కడిదాకా నెట్టుకొచ్చారు. అటుచూస్తే వందల కోట్లతో తీసిన రాజా సాబ్ లాంటి ప్యాన్ ఇండియా మూవీ ఇప్పటికే రెండు టీజర్లు, ఒక ట్రైలర్ కలిపి మొత్తం తొమ్మిది నిమిషాల వీడియోని అభిమానులకు చూపించేసింది.
బిజినెస్ ఎంత బాగా జరుగుతున్నా మెగాస్టార్ ఇమేజ్, రావిపూడి బ్రాండ్ మీద ఎంత క్రేజ్ నెలకొన్నా, గ్రౌండ్ లెవెల్ లో ముఖ్యంగా సోషల్ మీడియాలో దీని తాలూకు సౌండ్ ఇంకా పెరగాలి. ఇప్పుడు ట్రైలర్ లో చూపించే విజువల్స్, కామెడీ యాంగిల్స్, యాక్షన్ బిట్స్ మీదే ఇది ఆధారపడి ఉంటుంది.
ఎందుకంటే భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి తెరమీద కనిపించి రెండు సంవత్సరాల అయిదు నెలలైపోయాయి. ఇది చాలా ఎక్కువ గ్యాప్. అవతల బాలకృష్ణ ఇదే టైంలో దూసుకుపోయారు. అఖండ 2 టాక్ తో సంబంధం లేకుండా ఎంతో కొంత వసూళ్లు తెస్తూనే ఉండటానికి కారణం బాలయ్య స్క్రీన్ కంటిన్యూటీ మెయిన్ టైన్ చేయడం.
సో ఇప్పుడు ఒక్కసారిగా మన శంకరవరప్రసాద్ గారు మీద హైప్ పెరిగిపోవాలంటే ఆ మేజిక్ చేసే బాధ్యత ట్రైలర్ మీదే ఉంది. ఇన్ సైడ్ టాక్ అయితే అనిల్ రావిపూడి ఏదీ దాచకుండా మెయిన్ లైన్ రివీల్ చేశారని, చిరు నయన్ ప్రేమ,పెళ్లి, విడాకులతో పాటు ఫ్యామిలీ సెటప్, విలన్ గ్యాంగ్ వ్యవహారం లాంటివన్నీ చూపించబోతున్నారట.
ముఖ్యంగా మెగాస్టార్ స్వాగ్ చూపించే కీలకమైన క్లిప్స్ ఇందులో పొందుపరిచారని తెలిసింది. అదే నిజమైతే మటుకు ట్రైలర్ మీదున్న మెగా ఒత్తిడి పాజిటివ్ గా మారిపోయి అంచనాలు పెంచేస్తుంది. ముఖ్యంగా టార్గెట్ చేసుకున్న ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తే లక్ష్యం నెరవేరినట్టే.
This post was last modified on January 2, 2026 2:49 pm
నాగ చైతన్య కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోయిన లవ్ స్టోరీని ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా రీ…
విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం (AK47)' ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో…
సోషల్ మీడియా…రెండు వైపులా పదునున్న కత్తి. పిల్లల నుంచి పెద్దల వరకు టెక్ యుగంలో ఏదో ఒక సోషల్ మీడియా…
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ది బ్లఫ్' ట్రైలర్ వారం క్రితమే రిలీజయింది. బాలీవుడ్…
వాల్తేరు వీరయ్య కాంబినేషన్ రిపీట్ చేస్తూ చిరంజీవి చేయబోతున్న మెగా 158 కోసం దర్శకుడు బాబీ క్యాస్టింగ్ ఫైనల్ చేసే…
దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి మేఘాల్లో తేలిపోతున్నారు. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో వెంకటేష్ కో బ్లాక్ బస్టర్ ఇచ్చి…