మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కొత్త రూటు పట్టాడు. పెద్దగా హడావిడి లేకుండా షూటింగ్ చేసుకుంటూ ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న లెగసీ టీజర్ ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా లాంచ్ చేశారు. హారర్ మూవీ పిండంతో పరిచయమైన సాయికిరణ్ రెడ్డి రెండో సినిమా ఇది.
గత ఏడాది లైలా ఇచ్చిన డిజాస్టర్ షాకుకు విశ్వక్ సేన్ బాగా డిస్టర్బ్ అయ్యాడు. బయట కనిపించడం మానేసి ఫంకీ, లెగసీలో బిజీ అయిపోయాడు. మొదటిది ఫిబ్రవరి రిలీజ్ కు రెడీ అవుతుండగా రెండోది కూడా ఈ సంవత్సరమే ఆడియన్స్ ని పలకరించనుంది. ఇక లెగసీలో మెయిన్ కాన్సెప్ట్ రెండు నిమిషాల వీడియోలో స్పష్టంగా చెప్పేశారు.
కుటుంబాన్ని సైతం రాజకీయ స్వార్థం కోసం వాడుకోవడానికి వెనుకాడని ఒక నాయకుడు రావు రమేష్. అతను చేసే పనులకు అసహ్యం పెంచుకుని దూరంగా ఉంటాడు కొడుకు విశ్వక్ సేన్. ఒక రోజు హఠాత్తుగా తండ్రి చనిపోతాడు. దీంతో విశ్వక్ రావాల్సి వస్తుంది.
తండ్రి సమాధి మీద చేయకూడని పని చేయడానికి వెనుకాడనంత దారుణంగా ద్వేషించే విశ్వక్ పెద్దాయన వదిలిన పొలిటికల్ సామ్రాజ్యన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఫ్యామిలీలో ఉన్న కలహాలు, పదవి కోసం వెంపర్లాటలు ఇలా రోజూ యుద్ధం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. మరి ఈ గేమ్ లో ఎవరెవరు ఏమేం చేశారనేది తెరమీద చూడమంటున్నారు.
మహేష్ బాబు భరత్ అనే నేను, దగ్గుబాటి రానా లీడర్ ఛాయలు లెగసీలో కనిపిస్తున్నాయ్. అయితే వీటిలో ఒకదాంట్లో తండ్రి పాత్ర మంచిదైతే మరొకదాంట్లో అవినీతిపరుడిగా చూపించారు. లెగసీలో మాత్రం పూర్తి దుర్మార్గుడిని చేశారు.
రొటీన్ కి భిన్నంగా ఏదో ట్రై చేయాలని చూస్తున్న విశ్వక్ సేన్ ఆ మధ్య గ్యాంగ్స్ అఫ్ గోదావరి, గామితో ఎక్స్ పరిమెంట్లు చేశాడు కానీ ఆశించిన స్థాయిలో పెద్ద ఫలితాలు రాలేదు. ఈసారి నేను కాదు నా సినిమా కంటెంట్లు మాట్లాడతాయని కంకణం కట్టుకున్న విశ్వక్ సేన్ మరి ఈ లెగసీతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.
This post was last modified on January 1, 2026 8:44 pm
సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న పోలీస్ అధికారుల్లో సజ్జనార్ ఒకరు. యువత ఆయనకు బాగా కనెక్ట్ అవుతారు. ఓవైపు…
న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు అభిమానులు భారీ నెంబర్లు ఆశించారు. మురారి, సీతమ్మ వాకిట్లో…
ఫిబ్రవరి 1 నుంచి ఒక్క సిగరెట్ ధర రూ.72కు పెరుగుతుందన్న వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రస్తుతం…
కేవలం పదకొండు రోజుల్లో మన శంకరవరప్రసాద్ గారు విడుదల కానుంది. నాలుగో తేదీ ట్రైలర్ లాంచ్, ఏడు లేదా మరో…
రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర కానుకగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్…
ఇవాళ నూతన సంవత్సరం సందర్భంగా దాదాపుగా అన్ని చోట్లా సెలవు వాతావరణం ఉండటంతో జనం థియేటర్లకు బాగానే వెళ్లారు. ఈ…