ఇవాళ నూతన సంవత్సరం సందర్భంగా దాదాపుగా అన్ని చోట్లా సెలవు వాతావరణం ఉండటంతో జనం థియేటర్లకు బాగానే వెళ్లారు. ఈ రోజు ఏకంగా ఆరేడు రిలీజులు ఉన్నాయి కాబట్టి వాటిని హౌస్ ఫుల్ చేశారేమో అనుకుంటే పప్పులో కాలేసినట్టే.
తాజాగా వచ్చిన సైక్ సిద్దార్థ్, వనవీర, 45, మార్క్, నీలకంఠ, గత వైభవం, మదం దేనికీ పెద్దగా చెప్పుకునే ఓపెనింగ్స్ రాలేదు. ఉన్నంతలో నందు టీమ్ చేసిన ప్రమోషన్ల వల్ల ఏ సెంటర్లలో ప్రేక్షకులు కనిపించారు కానీ మిగిలినవి మాత్రం కనీస ఆక్యుపెన్సీల కోసం పోరాడాల్సిన పరిస్థితి. మరి ట్విస్ట్ ఏమనుకుంటున్నారా. ఈ రోజు విడుదలైన వాటికి కాకుండా వేరే సినిమాలకు పబ్లిక్ బాగా వచ్చారు.
రెండో వారంలో అడుగు పెట్టిన ఆది సాయికుమార్ శంబాల అనూహ్యంగా పికప్ అందుకుని బుక్ మై షో గంటల వారిగా చూపించే ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. అఖండ 2 తాండవం మళ్ళీ పుంజుకోవడం ఇంకో మలుపు. ఈషా, ఛాంపియన్ లకు డీసెంట్ టర్న్ అవుట్స్ కనిపిస్తున్నాయి.
నువ్వు నాకు నచ్చావ్ ఈ రిలీజ్ ఉదయం షోలకు భారీ స్పందన కనిపించగా పవన్ కళ్యాణ్ అభిమానులు జల్సాని పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. మురారి జస్ట్ ఓకే అనిపించుకుని బండి లాగుతోంది. ఇక దురంధర్ గురించి చెప్పనవసరం లేదు. నాలుగో వారంలోనూ రోజుకు నాలుగు షోలు వేస్తున్న అరుదైన రికార్డు చాలా చోట్ల అందుకుంది.
ఇదంతా ఈ రోజుకే పరిమితం అనడానికి లేదు. ఎందుకంటే రేపు మినహాయిస్తే మళ్ళీ వీకెండ్ వస్తుంది. ఇదే సీన్ రిపీట్ కావొచ్చు. బయ్యర్ల అంచనాలు కూడా అదే విధంగా ఉన్నాయి. నిజానికి కొత్త సినిమాలు ఏవైనా కొంచెం పెద్ద సౌండ్ చేస్తే రాజా సాబ్ వరకు ఫీడింగ్ వస్తుందనుకుంటే లాస్ట్ వీక్ వే మళ్ళీ ఫామ్ లోకి రావడం అనూహ్యం.
ఇంకో వారం దాటడం ఆలస్యం ప్రభాస్ తో సంక్రాంతి సందడి మొదలవుతుంది కాబట్టి ఆలోగా వీలైనంత రాబట్టుకునే టార్గెట్ మీద ఇప్పుడున్న సినిమాలు పరుగులు పెడుతున్నాయి. తెలంగాణలో అఖండ 2ని టికెట్ రేట్లు అమాంతం తగ్గించేయడానికి కారణం ఇదే.
This post was last modified on January 1, 2026 4:45 pm
సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న పోలీస్ అధికారుల్లో సజ్జనార్ ఒకరు. యువత ఆయనకు బాగా కనెక్ట్ అవుతారు. ఓవైపు…
న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు అభిమానులు భారీ నెంబర్లు ఆశించారు. మురారి, సీతమ్మ వాకిట్లో…
ఫిబ్రవరి 1 నుంచి ఒక్క సిగరెట్ ధర రూ.72కు పెరుగుతుందన్న వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రస్తుతం…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కొత్త రూటు పట్టాడు. పెద్దగా హడావిడి లేకుండా షూటింగ్ చేసుకుంటూ ఆల్రెడీ ఫస్ట్…
కేవలం పదకొండు రోజుల్లో మన శంకరవరప్రసాద్ గారు విడుదల కానుంది. నాలుగో తేదీ ట్రైలర్ లాంచ్, ఏడు లేదా మరో…
రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర కానుకగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్…