Movie News

ప్ర‌భాస్ అంద‌రికీ తినిపిస్తాడు కానీ త‌ను మాత్రం…

ప్ర‌భాస్‌తో క‌లిసి ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రూ త‌న గురించి మాట్లాడాల్సి వ‌చ్చిన‌పుడు.. అత‌ను క‌డుపు ప‌గిలిపోయేలా ఎలా ఫుడ్డు పెట్టి చంపేస్తాడో చెబుతుంటారు. ప్ర‌భాస్‌తో కొత్తగా సినిమా చేసిన వాళ్లు.. అత‌డి ఇంటి నుంచి వ‌చ్చే క్యారేజీల గురించి సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్ట‌డం మాండేట‌రీ. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో ఫౌజీ సినిమా చేస్తున్న ఇమాన్వీ సైతం ప్ర‌భాస్ తన కోసం తెప్పించి వ‌డ్డించిన వంట‌కాల గురించి సోష‌ల్ మీడియాలో పంచుకుంది.

ప్ర‌భాస్ విందు భోజ‌నం అంటే.. క‌నీసం ప‌ది ర‌కాల వంట‌కాలైనా ఉండాల్సిందే. ఐతే తన చుట్టూ ఉన్న వారికి ఇలా అప‌రిమిత‌మైన ఫుడ్డు పెట్టే ప్ర‌భాస్.. తాను మాత్రం చాలా ప‌రిమితంగా తింటాడ‌ట‌. రాజాసాబ్ సెట్స్‌లో ఎప్పుడూ అత‌ను రైస్, ఇత‌ర ఐటెమ్స్ తిన‌డ‌మే చూడ‌లేద‌ని అంటోంది ఆ చిత్ర క‌థానాయిక‌ల్లో ఒక‌రైన నిధి అగ‌ర్వాల్.

ఒక ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్ ఆహార‌పు అల‌వాట్ల‌పై నిధిని అడిగారు. అందుకామె బ‌దులిస్తూ.. ప్ర‌భాస్ ఎప్పుడూ చాలా ఆరోగ్య‌క‌ర‌మైన తిండే తింటాడ‌ని చెప్పింది. ఈ విష‌యంలో క్ర‌మ‌శిక్ష‌ణ పాటిస్తాడ‌ని పేర్కొంది. రాజాసాబ్ సెట్స్‌లో ఎప్పుడూ పండ్లే తీంటూ ఉండేవాడ‌ని ఆమె వెల్ల‌డించింది.

ఈ సినిమాలో పాత్ర‌కు త‌గ్గ‌ట్లుగా ప్ర‌భాస్ కొంచెం బ‌రువు త‌గ్గాల్సిన అవ‌స‌రం కూడా ఏర్ప‌డింద‌ని… దీంతో అతను స్ట్రిక్ట్ డైట్ మెయింటైన్ చేశాడ‌ని.. కొంచెం బ‌రువు కూడా త‌గ్గాడ‌ని ఆమె చెప్పింది. ప్ర‌భాస్ ఇంట్లో ఏమైనా వేరే ఫుడ్ తింటాడేమో తెలియ‌దు కానీ.. సెట్స్‌లో మాత్రం పండ్లు, డ్రైఫ్రూట్స్ లాంటివే తినేవాడ‌ని ఆమె చెప్పింది.

ప్ర‌భాస్ ఏర్పాటు చేసే విందు భోజ‌నాల గురించి చెప్పే వాళ్లంతా.. అత‌ను త‌మ డైట్ ప్లాన్స్ అన్నింటినీ దెబ్బ తీస్తున్నాడ‌ని.. త‌ను పెట్టేవ‌న్నీ తింటే అంతే సంగ‌తుల‌ని అంటుంటారు. అంద‌రికీ ఇలా లిమిట్ లెస్ ఫుడ్డు పెట్టే ప్ర‌భాస్.. తాను మాత్రం ఎంత స్ట్రిక్టుగా ఉంటాడో నిధి మాట‌ల్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. సంక్రాంతి కానుక‌గా రాజాసాబ్ జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మాళ‌విక మోహ‌న‌న్, రిద్ధి కుమార్ కూడా హీరోయిన్లుగా న‌టించారు. సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర పోషించాడు. మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించాడు.

This post was last modified on December 31, 2025 9:16 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఓటీటీ హీరో… థియేటర్ హీరో అయ్యాడు

లెజెండరీ నటుడు సాయికుమార్ వారసత్వాన్నందుకుంటూ సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఆది సాయికుమార్‌కు కెరీర్ ఆరంభంలో ప్రేమ కావాలి, లవ్లీ…

3 hours ago

నూతన సంవత్సర కానుక – పవన్ స్టైలే వేరు

గిరిజన మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర కానుకను ప్రకటించారు. గిరిజన…

4 hours ago

మాట నిల‌బెట్టుకున్న సీఎం.. ఉద్యోగుల‌కు 2026 కానుక‌!

తెలంగాణ ఉద్యోగుల‌కు.. రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త సంవ‌త్స‌రానికి ఒక‌రోజు ముందే భారీ కానుక‌ను ప్ర‌క‌టించింది. గ‌త కొన్నాళ్లుగా ఉద్యోగులు ఎదురు…

5 hours ago

టాలీవుడ్ 2025 – ది కంప్లీట్ రివ్యూ

ఎన్నో జ్ఞాపకాలు మిగులుస్తూ, ఎన్నెన్నో పాఠాలు నేర్పిస్తూ 2025 సెలవు తీసుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ కు సంబంధించి ఈసారి ఉగాది…

6 hours ago

ప్రభాస్ గురించి జక్కన్న చెప్పింది నిజమే

హీరోల్లో కొందరు బహుముఖ ప్రజ్ఞాశాలులు ఉంటారు. వాళ్లను అందరూ నటులుగానే చూస్తారు కానీ.. బయటికి కనిపించని వేరే టాలెంట్స్ చాలానే…

6 hours ago

ఫైటింగ్ ముగిసింది… కలిసి ప్రమోషన్లు చేస్తున్నారు

ముందు ‘వానర’ అనే పేరుతో తెరకెక్కి.. రిలీజ్ ముంగిట ‘వనవీర’ అని పేరు మార్చుకుంది ఓ సినిమా. అవినాష్ అనే…

8 hours ago