అసలే సంక్రాంతి పోటీ తీవ్రంగా ఉంది. ఒకటి రెండు కాదు ఏకంగా అరడజను సినిమాలు పోటీలో ఉండటం వల్ల ప్రమోషన్ల పరంగా ఎవరికి వారు నువ్వా నేనానే రీతిలో ప్లాన్ చేసుకుంటున్నారు. రాజా సాబ్ హైదరాబాద్ లో ఈవెంట్ చేస్తే మన శంకరవరప్రసాద్ గారు గుంటూరు వెళ్లి మెగా విక్టరీ సాంగ్ లాంచ్ చేసుకున్నారు.
అనగనగా ఒక రాజు భాగ్యనగరం నుంచి భీమవరం దాకా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడికి దూసుకెళ్ళిపోతున్నాడు. భర్త మహాశయులకు విజ్ఞప్తి ఇంత హడావిడి చేయకపోయినా ఉన్నంతలో రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ, పాటలు వదులుతూ సోషల్ మీడియాలో ఏదో ఒక సౌండ్ ఉండేలా చూసుకుంటోంది.
ఇక పండగ బరిలో అందరికంటే లాస్ట్ వస్తున్న నారి నారి నడుమ మురారి కొంచెం మౌనం, ఎక్కువ శబ్దం తరహాలో నెమ్మదిగా వెళ్తోంది. అయిదు రోజుల ముందు రచయిత భాను భోగవరపుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తర్వాత మళ్ళీ ఏ అప్డేట్ లేదు. ఆ పోస్టర్ లో కూడా విడుదల తేదీ లేకపోవడం గమనించాల్సిన విషయం.
ఇంతకు ముందు జనవరి 14 సాయంత్రం ప్రీమియర్లతో విడుదల ఉంటుందని టైం, ముహూర్తంతో సహా ప్రకటించిన టీమ్ ఇప్పుడీ తేదీని మాయం చేయడం వెనుక మర్మం ఏమిటో అంతు చిక్కడం లేదు. పబ్లిసిటీలో ఇలా అయిదేసి రోజులు గ్యాప్ ఇవ్వడం ఎంత మాత్రం సేఫ్ కాదు.
సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన నారి నారి నడుమ మురారిలో సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. కాకతాళీయంగా రవితేజ మూవీతో పాటు ఇందులోనూ డబుల్ హీరోయిన్ల మధ్య నలిగిపోయే సింగల్ హీరో ఫార్ములా ఉండటం అసలు ట్విస్ట్.
పండగ బరిలో ఉండటం ఫిక్స్ అనుకుంటే మాత్రం శర్వానంద్ బృందం ఇంకేదో స్పెషల్ అనిపించేది చేయాలి. కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా కాంపిటీషన్ ని మరీ తక్కువంచనా వేయకూడదు. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చారు.
This post was last modified on December 31, 2025 3:27 pm
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ కెరీర్లో చూడాలని ఉంది, ఒక్కడు లాంటి బ్లాక్‌బస్టర్లతో పాటు సైనికుడు, వరుడు, నిప్పు లాంటి దారుణమైన…
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో రియల్‌మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్‌ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…
దర్శకుడిగా తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’తో తరుణ్ భాస్కర్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండో సినిమా ‘ఈ నగరానికి…