భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత ఏకంగా రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఖచ్చితంగా గురి తప్పరనే నమ్మకంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇందులో వెంకటేష్ ప్రత్యేక క్యామియో చేయడం బజ్ పెంచుతోంది.
అయితే కథను చర్చిస్తున్న క్రమంలో వెంకీ క్యారెక్టర్ ని చిరునే రికమండ్ చేశారని, అందుకే అలా సెట్ చేశానని అనిల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం తెలిసిందే. అయితే సుదీర్ఘమైన తన కెరీర్ లో మిస్ అవ్వకూడదని కోరుకున్న కొన్ని కాంబోలు చిరు ఇలా ప్లాన్ చేస్తున్నారనే సందేహం రావడం సహజం. ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి.
గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ ని తీసుకురావడం వెనుక రామ్ చరణ్ చొరవ ఎంత ఉందో చిరంజీవి ప్రోత్సాహం కూడా అంతే ఉంది. వాల్తేరు వీరయ్యలో రవితేజని రికమండ్ చేయడం, సైరా నరసింహారెడ్డిలో విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్ లాంటి హీరోలను భాగం చేయడం, ఇదంతా కొత్త కలయికలను సాధ్యం చేయడం కోసమే అన్నది మూవీ లవర్స్ సందేహం.
బాబీ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించబోయే గ్యాంగ్ స్టర్ మూవీలో మోహన్ లాల్ ఒక ప్రత్యేక పాత్ర చేయడం దాదాపు ఖరారు అంటున్నారు. నిజమైతే మటుకు మంచి ఫ్రెండ్స్ గా ఉన్న మెగాస్టార్, లాలెట్టాన్ ఫస్ట్ టైం కాంబినేషన్ గా బజ్ తెచ్చుకుంటుంది.
ఫ్యాన్స్ కు ఇదంతా ఓకే కానీ వాళ్ళు కోరుకుంటున్నది వేరే ఉంది. చిరంజీవి సోలోగా ఆయన భుజాల మీద నడిచే బ్లాక్ బస్టర్ పడాలి. బాలయ్యను చూసుకుంటే అఖండ నుంచి డాకు మహారాజ్ దాకా దేంట్లోనూ ఇతర స్టార్లు ఉండరు. అన్నీ విజయాలు సాధించాయి. పోలికని కాదు కానీ ఈ తరహాలో కనక దూసుకెళ్తే మెగా మాస్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఆకాంక్ష.
రాజకీయాల నుంచి కంబ్యాక్ తర్వాత చిరంజీవి సోలోగా సంతృప్తి పరిచింది ఖైదీ నెంబర్ 150తోనే. మరి అభిమానుల కోరిక శ్రీకాంత్ ఓదెల ఏమైనా తీరుస్తాడేమో చూడాలి. అసలే వయొలెన్స్ స్పెల్లింగ్ ని రక్తంతో రాయించే ఈ యువ దర్శకుడు చిరుని ఎలా ప్రెజెంట్ చేస్తాడో.
This post was last modified on December 31, 2025 7:30 am
ఈ రోజు మినహాయిస్తే రాజా సాబ్ విడుదలకు కేవలం ఎనిమిది రోజులు మాత్రమే టైం ఉంది. తెలుగు వరకు ప్రమోషన్లు…
ఒకే భాషలో విడుదలై ప్యాన్ ఇండియా ట్యాగ్ లేకుండా 1100 కోట్లు వసూలు చేసి ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్న…
ప్రభాస్ కొత్త సినిమా ‘రాజా సాబ్’ నుంచి తాజాగా రిలీజైన ట్రైలర్ తన అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులనూ ఆకట్టుకుంది.…
2025లో తన బెంచ్ మార్క్ పాలనతో ఏడాదంతా క్షణం తీరిక లేకుండా ప్రజల్లో గడిపిన సీఎం చంద్రబాబు.. తనకు అత్యంత…
‘రాజాసాబ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు మారుతి ఎంత ఎమోషనల్ అయ్యాడో తెలిసిందే. ‘రాజాసాబ్’ ముందు వరకు మారుతి తీసినవన్నీ…
ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను మరో రెండు జిల్లాలు కలుపుతూ.. 28 జిల్లాలుగా ఏర్పాటు…